Gold Price: 2020లో రూ. ల‌క్షతో బంగారం కొని ఉంటే.. ఈరోజు మీ ద‌గ్గ‌ర ఎన్ని డ‌బ్బులుంటాయో తెలుసా?

Published : Jan 17, 2026, 04:42 PM IST

Gold Price: బంగారం ధ‌ర‌లు దూసుకెళ్తున్నాయి. ప్ర‌స్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర ఏకంగా రూ. ల‌క్షన్న‌ర‌కు చేరింది. అయితే 26 ఏళ్ల క్రితం రూ. ల‌క్ష‌తో బంగారం కొంటే నేడు వారి ద‌గ్గ‌ర ఎంత డ‌బ్బు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
రోజురోజుకీ పెరుగుతోన్న ధ‌ర‌లు

ఇటీవలి కాలంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఆర్థిక అనిశ్చితి పెరిగే సమయంలో ప్రజలు బంగారాన్ని భద్రతగా భావిస్తున్నారు. అందుకే ధరలు భారీగా పెరుగుతున్నాయి.

25
ప్రస్తుతం బంగారం ధర ఎంత ఉంది?

ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,780గా ఉంది. గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కొన్ని నెలల క్రితం వరకు కూడా ఇంత ధర ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు బంగారం ధరలను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.

35
26 ఏళ్ల క్రితం బంగారం ధర ఎంతో తెలుసా?

ఇప్పటి తరానికి ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. సుమారు 26 ఏళ్ల క్రితం, అంటే 2000 ప్రాంతంలో ఒక తులం బంగారం ధర కేవలం రూ.4,341 మాత్రమే. ఆ సమయంలో బంగారం కొనుగోలు చేసినవారు ఇప్పుడు ఊహ‌కంద‌ని లాభాం పొందారు.

45
అప్పట్లో లక్ష రూపాయలు పెట్టితే నేడు ఎంత అయ్యేది?

ఆ సమయంలో లక్ష రూపాయలతో సుమారు 25 తులాల బంగారం కొనుగోలు చేయవచ్చు. అదే 25 తులాల బంగారం ప్రస్తుతం రూ.35,94,500 విలువ చేస్తోంది. అంటే ల‌క్ష‌ పెట్టుబడితో దాదాపు 35 లక్షల వరకు లాభం వచ్చినట్టే. ఇది బంగారం ఎంత బలమైన పెట్టుబడో చెప్పేందుకు సాక్ష్యంగా చెప్పొచ్చు.

55
బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఇవే

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, డాలర్ మార్పులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారంపైనే ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా బంగారం నిల్వలు పెంచడం ధరలు పెరగడానికి మరో కారణం.

Read more Photos on
click me!

Recommended Stories