Chicken Price Hike: పెట్రోల్ దెబ్బ.. పెరగనున్న గుడ్లు, చికెన్ ధరలు.. అసలు సంగతి ఇదే

Published : Nov 10, 2026, 07:45 PM IST

Chicken Price Hike: పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ కోసం మొక్కజొన్న వాడకం పెరగడంతో పౌల్ట్రీ పరిశ్రమకు భారీ దెబ్బ తగలనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో చికెన్, గుడ్ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

PREV
15
చికెన్, గుడ్ల ధరలు డబుల్ కానున్నాయా? మార్కెట్లో ఏం జరుగుతోంది?

బైక్ లేదా కారు ట్యాంక్‌లో పోయించే పెట్రోల్ వల్ల చికెన్ ప్రియులకు పెద్ద షాక్ తగలనుంది. దేశంలో పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం అనే ప్రభుత్వ లక్ష్యం వేగంగా ముందుకు సాగుతోంది. అయితే ఈ క్రమంలో ఇథనాల్ తయారీకి మొక్కజొన్న వాడకం విపరీతంగా పెరిగిపోవడం పౌల్ట్రీ పరిశ్రమను కలవరపెడుతోంది. పౌల్ట్రీ ఫీడ్‌లో ప్రధాన భాగమైన మొక్కజొన్న కొరత ఏర్పడితే, కోడి దాణా ధరలు పెరిగి రాబోయే రోజుల్లో చికెన్, గుడ్ల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండాపోయే ప్రమాదం కనిపిస్తోంది.

25
ఇథనాల్ తయారీకి 11 బిలియన్ లీటర్ల టెండర్లు

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు E20 పెట్రోల్ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొత్తగా ఇథనాల్ టెండర్లను పిలిచాయి. ఈ టెండర్లలో మొక్కజొన్ననే అత్యంత ముఖ్యమైన ముడిసరుకుగా మార్చేశారు. గత ఏడాది ఇథనాల్ తయారీలో మొక్కజొన్న ఆఫర్లు 45 శాతంగా ఉంటే, ఈ సారి ఏకంగా 59 శాతానికి పెరిగాయి.

గత ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం ఇథనాల్ సరఫరాలో మొక్కజొన్న వాటా కేవలం 41 శాతంగా మాత్రమే ఉండేది. ఈ ఏడాది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మొత్తం 11 బిలియన్ లీటర్ల ఇథనాల్ కొనుగోలుకు టెండర్లు జారీ చేయగా, డిస్టిల్లరీలు, తయారీదారులు అవసరానికి మించి అంటే 1.8 రెట్లు (19.35 బిలియన్ లీటర్లు) సరఫరా చేస్తామని ఆఫర్లు ఇచ్చారు.

35
మొక్కజొన్న వైపే ఇథనాల్ కంపెనీల చూపు ఎందుకు?

దేశంలో కరవు పరిస్థితులు, తక్కువ ఉత్పత్తి కారణంగా ప్రభుత్వం చెరకు రసం, బి-హెవీ మోలాసెస్, షుగర్ సిరప్‌లను ఇథనాల్ ప్రోగ్రామ్ నుంచి పక్కనబెట్టింది. దీనికి తోడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) బియ్యం వాడకంపై కూడా 7.2 మిలియన్ టన్నుల పరిమితిని విధించింది.

దీంతో ఇథనాల్ కంపెనీలన్నీ తమ దృష్టిని మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యం వైపు తిప్పాయి. మొక్కజొన్న నుంచి తయారుచేసే ఇథనాల్ ధరపై ప్రభుత్వం లీటరుకు 3 రూపాయల కోత విధించినప్పటికీ, బహిరంగ మార్కెట్లో మొక్కజొన్న ధరలు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కావడమే చికెన్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతోంది.

45
పౌల్ట్రీ పరిశ్రమకు భారీ దెబ్బ.. ఎగిసిపడనున్న చికెన్ ధరలు

మొక్కజొన్న ను భారీగా ఇథనాల్ వైపు మళ్లించడం వల్ల పౌల్ట్రీ ఫార్మింగ్, పశువుల దాణా పరిశ్రమ లెక్కింపులన్నీ తలకిందులయ్యాయి. కోళ్ల దాణా తయారీలో దాదాపు 60 శాతం వాటా మొక్కజొన్నదే ఉంటుంది. ఇది కాకుండా స్టార్చ్, పేపర్ పరిశ్రమలకు కూడా ఇదే ముఖ్యమైన ముడిసరుకు.

ఇప్పుడు ఇథనాల్ రంగం, పౌల్ట్రీ రంగం రెండూ మొక్కజొన్న కోసమే పోటీ పడితే, మార్కెట్లో మొక్కజొన్న ధర మరింత మండిపోతుంది. పౌల్ట్రీ రైతులకు ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయి, ఆ భారం చివరకు చికెన్, గుడ్లు కొనే వినియోగదారుడి పైనే పడుతుందని వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

55
చికెన్ ప్రియుల బడ్జెట్‌కు కొత్త ముప్పు

ప్రారంభంలో వస్తున్న సరఫరా ఆఫర్ల సంఖ్య పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ, తుది కేటాయింపులు అనేది కంపెనీల కెపాసిటీ, ప్రభుత్వ నిబంధనలపై ఆధారపడి ఉంటాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా, మొక్కజొన్న డిమాండ్, సరఫరా మధ్య ఉన్న వ్యత్యాసం రాబోయే రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశం వుందనే ఆందోళనలు ఉన్నాయి.

సమయానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే, క్లీన్ ఎనర్జీ లక్ష్యం సాధించడం ఏమో గానీ పౌల్ట్రీ రంగం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి, చికెన్ ధరలు సామాన్యుడి వంటగది బడ్జెట్‌ను తలకిందులు చేయడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories