Post office: రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ నెల రూ. 20 వేలు

Published : Apr 23, 2026, 09:41 AM IST

Post office: రిటైర్మెంట్ త‌ర్వాత ఆదాయం ఎలా.? ఇది చాలా మందిని వేధించే ప్ర‌శ్న‌. ఇలాంటి వారి కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ స్కీమ్స్‌లో పోస్టాఫీస్ అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

PREV
15
బ్యాంకు కంటే మెరుగైన స్థిర ఆదాయం

ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ మీ ఖాతాలో జమ అవుతుంది. అంటే, రెగ్యులర్‌గా డబ్బు వస్తూనే ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత రోజువారీ ఖర్చులు, మందులు, ఇతర అవసరాల కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ పథకం ముఖ్యంగా ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకు చాలా ఉపయోగపడుతుంది.

25
8.2% వడ్డీ – ప్రభుత్వ హామీతో భద్రత

ఈ స్కీమ్‌పై ప్రస్తుతం సంవత్సరానికి 8.2% వడ్డీ లభిస్తుంది. ఇది చాలా సేఫ్, స్థిరమైన రిటర్న్. ప్రభుత్వం ఈ వడ్డీ రేటును నిర్ణయిస్తుంది కాబట్టి పెట్టుబడిపై భయం అవసరం లేదు. ఈ స్కీమ్ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. అవసరమైతే 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. దీని వల్ల దీర్ఘకాలిక ఆదాయం సులభంగా పొందవచ్చు.

35
ఎవరెవరు పెట్టుబడి పెట్టవచ్చు?

ఈ పథకం ప్రధానంగా 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి అందుబాటులో ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు కూడా (VRS తీసుకున్నవారు) ఇందులో చేరవచ్చు. రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులకు 50 సంవత్సరాల నుంచే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు కలసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఖాతా తెరవడానికి ఆధార్ కార్డ్ అవసరం.

45
పెట్టుబడి పరిమితులు, నియమాలు

ఈ స్కీమ్‌లో కనీసంగా రూ. 1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి మొత్తం ఎప్పుడూ రూ. 1,000ల మల్టిపుల్‌లో ఉండాలి. ఈ పరిమితిని మించితే అదనపు డబ్బు తిరిగి ఇస్తారు. కాబట్టి ముందుగానే సరైన ప్రణాళికతో పెట్టుబడి పెట్టడం మంచిది.

55
నెల‌కు రూ. 20 వేలు పొందాలంటే.?

ఈ స్కీమ్‌లో గరిష్ఠంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే, 8.2% వడ్డీ ప్రకారం సంవత్సరానికి సుమారు రూ. 2,46,000 వడ్డీ వస్తుంది. ఈ మొత్తాన్ని నెలవారీగా భాగం చేస్తే, ప్రతి నెలకు దాదాపు రూ. 20,500 ఆదాయం వస్తుంది. అంటే, ఒకసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా స్థిరమైన డబ్బు అందుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఇది పెద్ద ఆర్థిక భరోసా అవుతుంది.

గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టే ముందు నేరుగా మీకు స‌మీపంలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి సంప్ర‌దించ‌డం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories