Post Office: 5 ఏళ్ల‌లో 7 ల‌క్ష‌లు సంపాదించాలా.? నెల‌కు ఎంత పొదుపు చేయాలంటే..

Published : Apr 05, 2026, 02:20 PM IST

Post Office: మారిన ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలో చాలా మంది ముందు నుంచే పొదుపు చేయ‌డం ప్రారంభిస్తున్నారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోస్టాఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ మంచి ఎంపికగా మారుతోంది.  

PREV
15
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఏమిటి?

పోస్టాఫీస్ RD స్కీమ్ అనేది నెలనెలా స్థిరమైన మొత్తం జమ చేసే సేవింగ్ పథకం. చిన్న మొత్తాలతో కూడా పొదుపు చేయడానికి ఇది సహాయపడుతుంది. ఈ పథకంలో పెట్టిన డబ్బుపై వడ్డీతో పాటు వడ్డీపైన కూడా వడ్డీ వస్తుంది. దీంతో ఐదేళ్లలో మంచి మొత్తం చేతికి అందుతుంది. ఈ ప‌థ‌కంలో నెల‌కు రూ. 100 క‌నీస పెట్టుబ‌డి పెట్టొచ్చు, గ‌రిష్టంగా ఎలాంటి లిమిట్ ఉండ‌దు. ప్ర‌స్తుతం ఈ స్కీమ్‌లో వ‌డ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. వ‌డ్డీని త్రైమాసిక చ‌క్ర‌వడ్డీ లెక్క‌న లెక్కిస్తారు. ఈ స్కీమ్ కాలపరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండటంతో పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది.

25
మెచ్యూరిటీ కాలం ఎంత?

పోస్టాఫీస్ RD స్కీమ్ ప్రధాన కాలపరిమితి 5 సంవత్సరాలు. అంటే మొత్తం 60 నెలల పాటు మీరు నెలనెలా డబ్బు జమ చేయాలి. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా ఈ పథకాన్ని మరిన్ని 5 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది. అలాగే ఈ పథకంలో కొన్ని అదనపు సదుపాయాలు కూడా ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత లోన్ సదుపాయం పొందొచ్చు. 3 సంవత్సరాల తర్వాత ముందుగానే ఖాతా మూసే అవకాశం (అయితే వ‌డ్డీలో కోత ఉంటుంది). ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్‌కు ఖాతా ట్రాన్స్‌ఫర్ చేసుకోవ‌చ్చు.

35
నెలకు రూ.10,000 కడితే ఎంత వస్తుంది?

ఒకవేళ మీరు ప్రతి నెలా రూ.10,000 చొప్పున 5 సంవత్సరాలు జమ చేస్తే లెక్క ఇలా ఉంటుంది. మొత్తం 60 నెల‌ల‌కు గాను మీ పెట్టుబ‌డి రూ. 600000 అవుతుంది. దీనికి వ‌డ్డీ సుమారు రూ. 1,12,000 అవుతుంది. మెచ్యూరిటీ త‌ర్వాత మొత్తం రూ. 7,12,000 చేతికి వ‌స్తాయి. అంటే ఐదేళ్లలో మీ పెట్టుబడిపై ఒక లక్షకు పైగా వడ్డీ లభిస్తుంది. ఇది స్థిరమైన, భద్రమైన రాబడిగా భావించవచ్చు.

45
మరో 5 సంవత్సరాలు కొనసాగిస్తే ఎంత వస్తుంది?

ఐదేళ్ల తర్వాత ఖాతాను మూసేయకుండా మ‌రో 5 సంవత్సరాలు పొడిగిస్తే మొత్తం పొదుపు భారీగా పెరుగుతుంది. ఉదాహరణకు 10 సంవత్సరాలు నెలకు రూ.10,000 జమ చేస్తే మొత్తం పెట్టుబడి రూ.12,00,000 అవుతుంది. వడ్డీతో కలిపి సుమారు రూ.17 లక్షలకు పైగా చేరే అవకాశం ఉంటుంది. చక్రవడ్డీ కారణంగా కాలం పెరిగేకొద్దీ వడ్డీ కూడా గణనీయంగా పెరుగుతుంది.

55
ఈ స్కీమ్‌లో ఎలా చేరాలి?

పోస్టాఫీస్ RD అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సులభం. ఇందుకోసం మీకు దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లాలి. RD అకౌంట్ ఓపెనింగ్ ఫారం తీసుకోవాలి. ఆధార్, పాన్ వంటి KYC డాక్యుమెంట్లు సమర్పించాలి. మొదటి నెల డిపాజిట్ చెల్లించాలి. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ప్రతి నెల డబ్బు జమ చేయాలి. ఇప్పుడు చాలా పోస్టాఫీసుల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా RD డిపాజిట్లు చేయగలిగే సదుపాయం ఉంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఏదైనా ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సూచ‌న‌లు తీసుకోవ‌డ‌మే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories