Today Gold Rate: బంగారం ధరలకు రెక్కలు..ఇప్పుడు కొనడం మంచిదేనా?

Published : Apr 04, 2026, 11:06 AM IST

Today Gold Rate: మార్కెట్లు కొనుగోలుదారులను, ఇన్వెస్టర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ధరలు పెరుగుతున్నాయి.తగ్గుతున్నాయి. గందరగోళంలో ఉన్నారు. ఊరట కల్పిస్తూనే షాక్ ఇస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే.. 

PREV
13
నిపుణుల అంచనాలు తారుమారు

మార్కెట్లను ఎవరూ ఊహించలేకపోతున్నారు. నిపుణుల అంచనాలు సైతం తారుమారు అవుతున్నాయి. అటు యుద్ధం ఇంకా ముగియలేదు. దీంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి, ఇటు గోల్డ్ రేట్లు క్షీణిస్తున్నాయి. కానీ మార్కెట్లలో ఇంకా అనిశ్చితి కొనసాగుతుండటంతో కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు సందేహంలో పడిపోయారు. 

23
స్థిరంగానే పసిడి ధరలు

మొన్న భారీగా పడిపోయిన పసిడి ...మళ్లీ నిన్న పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. 5 వేల రూపాయలు తగ్గిందని సంతోషించేలోపే రూ.2వేలు పెరిగింది. దీంతో కొనుగోలుదారులు , బంగారం ప్రియులు...సందిగ్ధంలో పడిపోయారు. ఇవాళ మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేవలం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 మాత్రమే పెరిగింది. 

33
మార్కెట్లు గమనించండి

మొన్న ఒక్కరోజులోనే బంగారం ధరలు 5 వేల రూపాయలు పడిపోయాయి… అందరూ కొనాలని భావించేలోపే మళ్లీ మార్కెట్ ట్విస్ట్ ఇచ్చింది. ధరలు పెరిగిపోయాయి. మరో నెల రోజులు యుద్ధం జరిగే అవకాశముందని ట్రంప్ అంటున్నారు. సో నెలలో గోల్డ్ రేట్లు తగ్గినా ఆశ్చర్యపోవక్కర్లేదు, పెరిగినా తప్పదు.అయితే మార్కెట్‍లో ఇవాళ మళ్లీ బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్లపై రూ.10 పెగ్గగా...రూ.1,50,940కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.10 పెరగ్గా.. ఇప్పుడు రూ.1,38,360 పలుకుతోంది. వెండి స్థిరంగానే ఉంది. మార్కెట్లు గమనించి కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories