Jio Freedom Plan: ఎయిర్‌టెల్‌కు జియో షాకిచ్చింది. కస్టమర్ల కోసం ఫ్రీడమ్ ప్లాన్ తీసుకొచ్చింది. 100Mbps వేగంతో బ్రాడ్ బ్యాండ్, స్థిరమైన కనెక్టివిటీతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంల సబ్ స్క్రిప్షన్ కూడా ఎక్స్ ట్రా ఛార్జీ లేకుడా అందుబాటులో ఉంటాయి.
ఎయిర్‌టెల్‌కు జియో గట్టి షాకిచ్చింది. కస్టమర్ల కోసం ఫ్రీడమ్ ప్లాన్ తీసుకొచ్చింది. 100Mbps వేగంతో బ్రాడ్ బ్యాండ్, స్థిరమైన కనెక్టివిటీతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంల సబ్ స్క్రిప్షన్ కూడా ఎక్స్ ట్రా ఛార్జీ లేకుడా అందుబాటులో ఉంటాయి. ఇండియాలో నంబర్ 1 టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో, ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తెస్తూనే ఉంటుంది. ఇలా కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ, పాతవారిని నిలుపుకుంటోంది. ఇప్పుడు, జియో తన బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం 'ఫ్రీడమ్ ప్లాన్' అనే కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌లో యూజర్లు 100Mbps వేగంతో డేటాను డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేసుకోవచ్చు. ప్లాన్ వాలిడిటీ ముగిసే వరకు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.
24
ఎన్నో ఓటీటీ యాప్స్ ఉచితం
ఈ ప్లాన్‌లో యూజర్లకు ఇంటర్నెట్‌తో పాటు టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా లభిస్తుంది. జియోటీవీతో పాటు ఎన్నో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ పొందొచ్చు. JioHotstar, SonyLIV, Zee5, Sun NXT, Hoichoi, Discovery+, TimesPlay, ShemarooMe వంటి యాప్స్ ఈ ప్యాక్‌లో ఉన్నాయి. ఓటీటీ యాప్స్‌తో పాటు, జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా 800కు పైగా డిజిటల్ లైవ్ టీవీ ఛానెళ్లను చూసే సౌకర్యం కూడా ఈ ప్లాన్‌లో ఉంది. JioHotstar, SonyLIV వంటి టాప్ యాప్స్‌తో పాటు FanCode (స్పోర్ట్స్ లైవ్), జియో సొంత మూవీ ప్లాట్‌ఫామ్ JioCinema Premium యాక్సెస్ కూడా లభిస్తుంది. 12 నెలల ఫీజు చెల్లించి 15 నెలల వాలిడిటీ పొందవచ్చు. అంటే, కస్టమర్లకు 3 నెలల అదనపు వాలిడిటీ ఉచితంగా వస్తుంది.
34
ఈ ప్లాన్ ఎవరికి లాభం?
ఈ ఫ్రీడమ్ ప్లాన్ తీసుకున్న యూజర్లకు జియో ఒక సెట్-టాప్ బాక్స్‌ను ఇస్తుంది. మీరు ఎక్కువ ఇంటర్నెట్ వాడేవారైతే, ఆన్‌లైన్‌లో కంటెంట్ క్రియేట్ చేసేవారైతే, లేదా ఇంటి నుంచి పనిచేసే (Work From Home) వారైతే, ఈ ఫ్రీడమ్ ప్లాన్ ఒక మంచి ఆప్షన్. ఈ కొత్త ప్లాన్‌ను JioFiber, Jio AirFiber యూజర్ల కోసం అందిస్తున్నారు. కస్టమర్లు జియో అధికారిక వెబ్‌సైట్ లేదా MyJio యాప్ ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 15 నెలల వాలిడిటీతో వస్తుంది, దీని ధర రూ.10,000గా నిర్ణయించారు. ఈ ప్లాన్ అసలు ధర రూ.10,000 అయినప్పటికీ, దీనికి 18% జీఎస్టీ కలుపుకుంటే మొత్తం సుమారు రూ.11,800 అవుతుంది. కొత్త కస్టమర్లకు జియో ఎయిర్‌ఫైబర్ లేదా జియోఫైబర్ కనెక్షన్ కోసం ఇన్‌స్టాలేషన్ ఫీజు (రూ.1,000) మాఫీ చేస్తారో లేదో చెక్ చేసుకోవాలి.
జియో తెచ్చిన ఈ కొత్త ఫ్రీడమ్ ప్లాన్, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు రూ.499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కేవలం 40mbps వేగంతో మాత్రమే ఇంటర్నెట్ అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ ఒక నెల మాత్రమే. జియో స్పీడ్ ఎక్కువగా ఉండటంతో, ఎయిర్‌టెల్‌కు ఈ కొత్త ప్లాన్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.