నెల‌కు రూ. 6 వేలు పొదుపు చేస్తే రూ. 20 ల‌క్ష‌లు మీ సొంతం.. వ‌డ్డీనే రూ. 9 ల‌క్ష‌లు వ‌స్తుంది

Published : Oct 29, 2025, 03:13 PM IST

Post Office: ఎంత సంపాదించామ‌న్న‌ది కాదు, ఎంత పొదుపు చేశామ‌న్న‌దే ముఖ్య‌మ‌ని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. చిన్న మొత్తంలో పొదుపు చేస్తూ పోతే దీర్ఘ‌కాలంలో పెద్ద మొత్తంలో చేతికి వ‌చ్చే ప‌థ‌కాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక ప‌థ‌కం గురించి ఇప్పుడు తెలుసుకుందాం

PREV
15
పొదుపుతో పెద్ద మొత్తాలు సాధ్యం

డ‌బ్బు ఆదా చేయాలన్నా, భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలన్నా సురక్షితమైన మార్గాన్ని వెతుకుతున్నారు. అటువంటి పెట్టుబడిదారుల కోసం భారత ప్రభుత్వం అందిస్తున్న అత్యంత విశ్వసనీయమైన పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). ఇది పోస్ట్ ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న సురక్షిత సేవింగ్స్ స్కీమ్‌. ప్రభుత్వ హామీ, పన్ను మినహాయింపు, స్థిరమైన వడ్డీ రేట్లు ఇవ‌న్నీ క‌లిపి PPFను బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌గా చెప్పొచ్చు.

25
PPF అంటే ఏమిటి?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 15 సంవత్సరాల గడువున్న దీర్ఘకాలిక పొదుపు పథకం. మీరు ప్రతి నెలా లేదా సంవత్సరానికి ఒకసారి మీకు వీలైనంత డబ్బు జమ చేయవచ్చు. కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి 7.1 శాతం వార్షిక వడ్డీ రేటు ఉంది. ఇది పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. అంటే పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు.

35
రూ. 20 ల‌క్ష‌లు రావాలంటే.?

మెచ్యూరిటీ త‌ర్వాత మీకు రూ. 20 ల‌క్ష‌లు చేతికి రావాలంటే మీరు ప్ర‌తీ నెల రూ. 6,250 పొదుపు చేయాల్సి ఉంటుంది. సంవత్సరానికి అది రూ.75,000 అవుతుంది. 15 సంవత్సరాల పాటు ఈ మొత్తాన్ని క్రమం తప్పకుండా జమ చేస్తే.. మొత్తం పెట్టుబడి రూ. 11,25,000 అవుతుంది. 7.1% వడ్డీతో వచ్చే లాభం సుమారు రూ. 8.9 లక్షలు అవుతుంది. 15 ఏళ్ల త‌ర్వాత రూ. 20.15 ల‌క్ష‌లు అవుతుంది. అంటే మీరు 15 ఏళ్లలో కేవ‌లం వ‌డ్డీ రూపంలోనే రూ. 9 ల‌క్ష‌లు పొందుతారు.

45
ఈ పథకంతో క‌లిగే ప్రయోజనాలు ఇవే..

* పన్ను మినహాయింపు (Tax Benefit): PPF పెట్టుబడులు 80C సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు.

* రుణ సౌకర్యం (Loan Facility): ఖాతా తెరిచిన రెండో సంవత్సరం తర్వాత రుణం పొందవచ్చు.

* ఉపసంహరణ (Partial Withdrawal): ఐదేళ్ల తర్వాత కొంత మొత్తం అవసరమైతే తీసుకోవచ్చు.

* సురక్షిత పెట్టుబడి (Government Guarantee): ఇది ప్రభుత్వ హామీతో ఉండే పథకం కాబట్టి రిస్క్ ఉండ‌దు.

55
పొదుపు క్రమం తప్పక కొనసాగిస్తేనే లాభం

PPFలో సిస్టమాటిక్‌గా పెట్టుబడి పెడితే, కాంపౌండ్ ఇంటరెస్ట్ ద్వారా ఎక్కువ లాభం వస్తుంది. ప్రతి నెలా జమ చేసే డబ్బు పెరిగే కొద్దీ వడ్డీ కూడా పెరుగుతుంది. మధ్యలో ఉపసంహరణ చేయకపోవడం ఉత్తమం. ఈ ప‌థ‌కం ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. అలాగే భవిష్యత్తు కోసం పిల్లల పేరుతో సేవింగ్స్ చేయాలనుకునే తల్లిదండ్రులకు, పన్ను మినహాయింపు కోరుకునే వారికి కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Read more Photos on
click me!

Recommended Stories