అమెజాన్ ఇండియా నుంచి 1100 మంది ఉద్యోగుల తొలగింపు? ఇది ఎంతవరకు నిజం?

Published : Oct 29, 2025, 01:31 PM IST

Amazon India: ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ అత్యంత పెద్ద కంపెనీల్లో ఒకటి. ఇందులో ఉద్యోగం వస్తే అదృష్టమనే అంటారు. అయితే ఇప్పుడు అమెజాన్ ఇండియా నుంచి కొంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

PREV
14
అమెజాన్ ఇండియాలో ఉద్యోగాల కోత

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్. ఇది కూడా తమ ఖర్చును తగ్గించుకోవడం కోసం లే ఆఫ్ ల ప్రక్రియ చేపట్టిందని తెలుస్తోంది. అమెజాన్ ఇండియా నుంచి 900 నుండి 1100 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని, అదే ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం వస్తోంది. అయితే ఇది పూర్తిగా నిజమో కాదో ఇంకా తెలియ రాలేదు. ఇదే విషయాన్ని ఏషియా నెట్ న్యూస్ వారు amazon కు మెయిల్ ద్వారా ప్రశ్నించారు. అమెజాన్ స్పందించగానే మీకు మేము ఆ విషయాన్ని తెలియజేస్తాము. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కు అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో భారతదేశము కూడా ఒకటి. అలాంటిది భారతదేశం నుంచి వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించడం అంటే చిన్న విషయం కాదు.

24
గతంలో లేఆఫ్ లు

గతంలో అమెజాన్ లేఆఫ్ ప్రక్రియ చేపట్టింది.2022లో దాదాపు 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ చరిత్రలో అతిపెద్ద ఉద్యోగులు తగ్గింపు ఇదే. కరోనా టైం లో నియామకాలు జోరుగా సాగినప్పటికీ కంపెనీలోని కొన్ని మార్పుల కోసం సీఈవో ఆండీ జాస్సి ఖర్చును తగ్గించేందుకు ఆప్టిమైజేషన్ డ్రైవ్ లో భాగంగా అప్పట్లో లే ఆఫ్ లను చేపట్టారు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు.

34
భారత్ చాలా ముఖ్యం... కానీ

భారతదేశం అమెజాన్ కు అత్యంత ముఖ్యమైన మార్కెట్ గా ఇప్పటికీ ఉంది. డెలివరీలను వేగంగా, మరింత నమ్మదగినదిగా చేయడానికి... లాజిస్టిక్స్ నెట్వర్క్ విస్తరించేందుకు ఆ కంపెనీ ఈ సంవత్సరమే రెండువేల కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా ప్రకటించింది. అలాంటిది ఇప్పుడు అమెజాన్ ఇండియా నుంచి ఉద్యోగులను తొలగిస్తారు అనే వార్త ఎంతో మందిని కంగారుకు గురిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్టు అంచనా. ఇప్పుడు వారిలో 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.

44
ఈ మెయిల్ ద్వారా చెబుతారు

ఎవరెవరికి లే ఆఫ్ ఇవ్వబోతున్నారో వారికి ఈమెయిల్ ద్వారా సమాచారం అందించబోతున్నారు. మానవ వనరుల విభాగం, అమెజాన్, వెబ్ సర్వీసులు, ఆపరేషన్, డివైజెస్ వంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా ఉద్యోగులకు లే ఆఫ్ ఇచ్చేందుకు అమెజాన్ సిద్దమైనట్టు సమాచారం. కరోనా సంక్షోభ సమయంలో భారీ స్థాయిలో అమెజాన్ ఉద్యోగులను తీసుకుంది. ఇప్పుడు వారందరిని తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

Read more Photos on
click me!

Recommended Stories