మీరు ఏం చేయ‌క‌పోయినా ప్ర‌తీ నెల మీ ఖాతాలోకి రూ. 9 వేలు.. తెలివైన వాళ్లు ఇదే చేస్తారు

Published : Nov 15, 2025, 09:43 AM IST

Post office: సంపాదించున్న డ‌బ్బును స‌రిగ్గా మేనేజ్ చేసుకుంటేనే ఆర్థిక భ‌ద్ర‌త ఉంటుంద‌ని నిపుణులు చెబుతుంటారు. మ‌రి ప్ర‌భుత్వ స‌పోర్ట్‌తో పాటు మంచి రిట‌ర్న్స్ వ‌చ్చే అలాంటి ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
పోస్టాఫీస్ మంథ్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS)

పోస్ట్ ఆఫీస్ మంథ్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS) అనేది 'నో రిస్క్, గ్యారెంటీడ్ ఇన్కమ్ ప‌థ‌కం. వృద్ధులు, ఉద్యోగులకు ఈ ప‌థ‌కం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ప‌థ‌కంలో ఒకసారి మూలధనం జమ చేస్తే, 5 సంవత్సరాల పాటు నెలసారి ఫిక్స్డ్ వడ్డీ చెల్లిస్తారు. అవ‌స‌ర‌మైతే మ‌ళ్లీ దీనిని పొడ‌గించుకోవ‌చ్చు.

25
వ‌డ్డీ ఏంతంటే.?

ప్రస్తుతం ఈ స్కీమ్‌పై వార్షిక వడ్డీ రేటు 7.4% ఉంది. జాయింట్ అకౌంట్ కోసం అత్యధిక జమ మొత్తము రూ. 15,00,000 వరకు ఉంటుంది. అంటే జాయింట్ అకౌంట్ ద్వారా గ‌రిష్టంగా రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌టొచ్చు. ఇలా చేస్తే మీకు ప్ర‌తీ నెల రూ. 9,250 వ‌స్తుంది. ఈ మొత్తం నేరుగా మీ సేవింగ్ అకౌంట్‌లో ప‌డిపోతుంది. వ‌డ్డీ రూపంలోనే వార్షిక ఆదాయం రూ. 1,11,000 పొందొచ్చు. ఇలా చూసుకుంటే ఐదేళ్ల‌లో మొత్తం రూ. 5,55,000 వ‌స్తుంది.

35
సింగిల్ అకౌంట్ అయితే..

ఇక‌వేళ సింగిల్ అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా రూ. 9 ల‌క్ష‌లు ఇన్వెస్ట్ చేసుకోవ‌చ్చు. దీంట్లో కూడా 7.5 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. రూ. 9 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెడితే నెల‌కు రూ. 5500 వ‌డ్డీ ల‌భిస్తుంది. 5 సంవత్సరాల మొత్తం ఆదాయం రూ.3,33,000 అవుతుంది.

45
అస‌లు అలాగే ఉంటుంది

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌లో మీరు పెట్టుబ‌డి పెట్టిన అస‌లు అలాగే ఉంటుంది, అద‌నంగా వ‌డ్డీ ల‌భిస్తుంది. 5 సంవత్సరాల కాలం ముగిసిన తర్వాత మీ పెట్టిన మొత్తం పూర్తిగా తిరిగి వస్తుంది. సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ తో పోలిస్తే మార్కెట్ రిస్క్ అస్స‌లు ఉండ‌దు. అదనంగా ప్రతి నెల వడ్డీ పొందడం వల్ల క్యాష్ ఫ్లో కూడా మెరుగ్గా ఉంటుంది. మీరు ఇష్టమైతే 5 సంవత్సరాలు ముగిసిన వెంటనే స్కీమ్‌ను మరో 5 సంవ‌త్స‌రాలు పెంచుకోవ‌చ్చు.

55
అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి.?

POMIS ఖాతా తెరువు చాలా సులభం. భారతీయ పౌరులందరూ ఖాతా తెరుచుకోవచ్చు. మీ పిల్ల‌ల పేరుతో కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పిల్లల వయసు 10 సంవత్సరాల కంటే త‌క్కువ అయితే.. ఆ ఖాతాను అతని తల్లితండ్రులు లేదా లీగల్ గార్డియ‌న్‌ ఆపరేట్ చేస్తారు. ఖాతా తెరవడానికి సమీప పోస్టాఫీస్‌కు వెళ్లాలి. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండడం తప్పనిసరి, గుర్తింపు కోసం ఆధార్ కార్డు, PAN కార్డు ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories