7వ తేదీలోపు జీతం రాలేదా? అయితే మీ బాస్‌ని జైలుకు పంపించవచ్చు తెలుసా?

Published : Nov 13, 2025, 04:57 PM IST

ప్రతి ఉద్యోగి నెలాఖరులో జీతం కోసం ఎదురుచూస్తాడు. కానీ చాలా కంపెనీలు చాలాసార్లు జీతం చెల్లింపును వాయిదా వేస్తుంటాయి. ఉద్యోగులు కూడా సైలెంట్ గా ఉంటారు. కానీ శాలరీ ఆపడం చట్టం ప్రకారం నేరం. శాలరీ లేటైతే బాస్ ని జైలుకి కూడా పంపించవచ్చని మీకు తెలుసా?

PREV
15
ఉద్యోగుల హక్కులు

జీతం అంటే కేవలం డబ్బు కాదు. నెల రోజులు పడిన శ్రమకు లభించే గౌరవం. ప్రతీ ఉద్యోగి నెలాఖరున జీతం కోసం ఎదురుచూస్తాడు. కానీ కొన్నిసార్లు కంపెనీలు లేదా యజమానులు జీతం చెల్లింపులో ఆలస్యం చేస్తుంటారు. “కొద్దిరోజులు ఆగండి”, “బ్యాంక్ సమస్య ఉంది”, “అకౌంట్స్ టీం చూసుకుంటుంది”. వంటి మాటలతో కాలం గడుపుతుంటారు. ఉద్యోగులు కూడా సైలెంట్ గా వీటిని భరిస్తుంటారు. కానీ శాలరీ ఆలస్యం చేయడం చట్టపరంగా నేరం. ఇంతకీ ఆ చట్టమేంటి? శాలరీ లేటుగా ఇస్తే.. చట్టపరంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఇక్కడ చూద్దాం.

25
కార్మీక చట్టం 1936

భారత కార్మిక చట్టం ప్రకారం 1936 ప్రకారం ప్రతి ఉద్యోగి తన జీతాన్ని నెల ముగిసిన 7 రోజుల లోపే పొందాలి. అంటే అక్టోబర్ నెల జీతం.. నవంబర్ 7వ తేదీకి ముందే పొందాలి. ఆ తర్వాత కూడా జీతం రాకపోతే.. అది చట్ట విరుద్ధం. సాధారణంగా చిన్న సంస్థల్లో అంటే వెయ్యి మందికి తక్కువ ఉద్యోగులు ఉన్న చోట 7 రోజుల లోపే చెల్లించాలి. పెద్ద కంపెనీల్లో గరిష్ఠంగా 10 రోజుల వరకు గడువు ఉంటుంది. ఏ కారణం వల్ల జీతం ఆలస్యమైనా చట్టం అనుమతించదు.

35
జైలు శిక్ష విధించే అవకాశం

జీతం ఆలస్యం చేసిన యజమానిపై ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం, ఉద్దేశపూర్వకంగా జీతం చెల్లింపులో ఆలస్యం చేసిన యజమానికి జరిమానా విధించవచ్చు. కొన్ని తీవ్రమైన కేసుల్లో జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఎందుకంటే జీతం చెల్లించడం ఉద్యోగికి యజమాని చేసే ఉపకారం కాదు, అది ఆయన బాధ్యత, చట్టబద్ధమైన కర్తవ్యం.

45
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..

ఒకవేళ మీ జీతం ఆలస్యమైతే ముందుగా మీ HR లేదా అకౌంట్స్ విభాగాన్ని సంప్రదించండి. వారికి స్పష్టంగా సమస్య వివరించండి. కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల కూడా ఆలస్యం కావచ్చు. కానీ వారు చర్య తీసుకోకపోతే, లేదా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మీరు ప్రభుత్వ సహాయం పొందవచ్చు. కార్మిక శాఖ దీనికోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌- 155214 ను ఏర్పాటు చేసింది . ఈ నంబర్‌కు కాల్ చేసి, మీ కంపెనీ పేరు, వివరాలు, జీతం ఆలస్యం అయిన నెలలు తెలియజేస్తే చాలు... వారు మీ ఫిర్యాదును నమోదు చేసి, సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తారు. అవసరమైతే లేబర్ కోర్ట్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇది పూర్తిగా ఉచితం, అలాగే ఉద్యోగిపై ఏలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు.

55
చట్ట ప్రకారం ముందుకు సాగడం..

సాధారణంగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్ట్ లేదా స్టార్టప్ రంగాల్లో జీతం ఆలస్యంగా ఇవ్వడం ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొద్ది రోజులే కదా వెయిట్ చేద్దాములే అని ఉద్యోగులు కూడా తమ హక్కులను కోల్పోతుంటారు. కానీ శ్రమకు తగిన ఫలితాన్ని సమయానికి పొందే హక్కు ఉద్యోగులకు ఉంది. అది చట్టమే చెబుతోంది.

జీతం ఆలస్యం కావడం వల్ల ఉద్యోగి ఆర్థికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఒత్తిడిని ఎదుర్కొంటాడు. EMIలు, అద్దె, బిల్లులు, కుటుంబ అవసరాలు అన్నీ జీతంపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి జీతం ఆలస్యమైన సందర్భంలో ఉద్యోగులు చట్ట ప్రకారం ముందుకు సాగడం మంచిది.  

Read more Photos on
click me!

Recommended Stories