ఆర్‌బి‌ఐ ఇన్నోవేటివ్ కస్టమర్ సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభించనున్నా భారత ప్రధాని..

First Published Nov 11, 2021, 3:41 PM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(prime minister) 12 నవంబర్ 2021న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ (reserve bank)ఆఫ్ ఇండియా  రెండు వినూత్న కస్టమర్ సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలలో ఒకటి ఆర్‌బి‌ఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ మరొకటి రిజర్వ్ బ్యాంక్ - ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్.

ఆర్‌బి‌ఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ అనేది రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌కు యాక్సెస్‌ను పెంచే లక్ష్యంతో ఉంది. భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే సెక్యూరిటీలలో నేరుగా పెట్టుబడి పెట్టడానికి ఈ స్కీమ్ వారికి కొత్త మార్గాన్ని అందిస్తుంది. పెట్టుబడిదారులు వారి ప్రభుత్వ సెక్యూరిటీల ఖాతాను ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆర్‌బిఐతో సులభంగా తెరవచ్చు, నిర్వహించవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ - ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్  అనేది ఆర్‌బి‌ఐచే నియంత్రించబడే సంస్థలపై కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం  సెంట్రల్ థీమ్ 'వన్ నేషన్-వన్ అంబుడ్స్‌మన్' ఆధారంగా కస్టమర్‌లు వారి ఫిర్యాదులను నమోదు చేయడానికి ఒక పోర్టల్, ఒక ఇమెయిల్, ఒక చిరునామాతో రూపొందించబడింది. 

కస్టమర్‌లు తమ ఫిర్యాదులను ఫైల్ చేయడానికి, డాక్యుమెంట్స్ సమర్పించడానికి, స్టేటస్ ట్రాక్ చేయడానికి, అభిప్రాయాన్ని తెలపడానికి సింగిల్ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్  కూడా ఉంటుంది. మల్టీ లాంగ్వేజ్ టోల్-ఫ్రీ నంబర్ ఫిర్యాదుల పరిష్కారం, ఫిర్యాదుల కోసం సహాయంపై పూర్తి సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ గవర్నర్‌ కూడా హాజరుకానున్నారు.

click me!