OYO రూమ్‌కి వెళ్లే వారికే కాదు.. వారికి కూడా గుడ్ న్యూస్‌. రూ. 6,650 కోట్లు ల‌క్ష్యంగా

Published : Jun 03, 2026, 03:24 PM IST

OYO: హోటల్, ట్రావెల్ టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థ OYOకి చెందిన మాతృసంస్థ PRISM తన ప్రతిష్ఠాత్మక IPO (Initial Public Offering) దిశగా కీలక అడుగు వేసింది. కంపెనీ ప్రతిపాదించిన IPOకి భారత మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI నుంచి అనుమతి లభించింది. 

PREV
15
IPO ద్వారా రూ.6,650 కోట్ల సమీకరణ లక్ష్యం

గతంలో నిర్వహించిన ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌న‌ర‌ల్ సమావేశం (EGM)లో కంపెనీ వాటాదారులు కొత్త ఈక్విటీ షేర్ల జారీకి ఆమోదం తెలిపారు. ఈ IPO ద్వారా సుమారు రూ.6,650 కోట్లు సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, IPO తర్వాత కంపెనీ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది OYO భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు బలమైన ఆర్థిక మద్ధతుగా మారనుంది.

25
జూలైలో కీలక పత్రాల దాఖలు

IPO ప్రక్రియలో తదుపరి దశగా కంపెనీ అప్టేడెట్ డ్రాఫ్ట్ రెడ్ హియ‌రింగ్ ప్రొస్పెక్ట్స్ (UDRHP-1)ను ప్రజల ముందుకు తీసుకురానుంది. ఈ పత్రం 21 రోజుల పాటు ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంటుంది. సమాచారం ప్రకారం, జూలై 2026 ప్రారంభంలోనే ఈ పత్రాన్ని దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడిదారుల స్పందన, లిస్టింగ్‌కు అనుకూల సమయాన్ని కంపెనీ పరిశీలిస్తోంది.

35
ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు రంగంలోకి

ఈ IPO నిర్వహణ కోసం పలు ప్రముఖ ఆర్థిక సంస్థలను కంపెనీ నియమించింది. యాక్సిస్ క్యాపిట‌ల్‌, సిటిబ్యాంక్‌, గోల్డ్‌మెన్ Sachs, ICICI Securities, SBI Capital Markets, JM Financial, InCred Capital వంటి సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఈ సంస్థల భాగస్వామ్యంతో IPO ప్రక్రియ మరింత బలంగా సాగుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

45
బోర్డులోకి మాజీ SEBI చైర్మన్

కంపెనీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. SEBI మాజీ చైర్మన్ అజయ్ త్యాగీని స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డులోకి తీసుకుంది. అనుభవజ్ఞుడైన నియంత్రణ నిపుణుడు బోర్డులో చేరడం వల్ల కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

55
OYOపై Moody’s విశ్వాసం

అంతర్జాతీయ రేటింగ్ సంస్థ Moody’s కూడా OYO మాతృసంస్థ PRISMపై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేసింది. కంపెనీకి ఇచ్చిన B2 కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్‌ను కొనసాగిస్తూ 'స్టేబుల్ అవుట్‌లుక్'ను ప్రకటించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ EBITDA 280 మిలియన్ డాలర్లకు పైగా చేరవచ్చని Moody’s అంచనా వేసింది. G6 Hospitality కొనుగోలు, ప్రీమియం హోటళ్ల విస్తరణ, ఖర్చుల నియంత్రణ వంటి అంశాలు కంపెనీ వృద్ధికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. OYO IPO మార్కెట్లోకి వస్తే, భారత స్టార్టప్ రంగంలో మరో భారీ లిస్టింగ్‌గా నిలిచే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories