Phonepay: క్రెడిట్‌ కార్డు తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ ఎంత తగ్గుతుంది? ఈ ఫోన్‌పే ఫీచర్‌తో తెలుసుకోవచ్చు

Published : Mar 29, 2025, 05:36 PM IST

Credit Score: ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. దీంతో క్రెడిట్‌ స్కోర్‌ మెరుగ్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై అవగాహన పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే క్రెడిట్ స్కోర్‌ను ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయన్న విషయం మాత్రం అందరికీ తెలియకపోవచ్చు. ఇందుకోసం ఫోన్‌పే యాప్‌లో ఒక కొత్త ఫీచర్‌ వచ్చేసింది. ఇంతకీ ఆ ఫీచర్‌ ఏంటి.? ఎలా ఉపయోగించుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..    

PREV
14
Phonepay: క్రెడిట్‌ కార్డు తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ ఎంత తగ్గుతుంది? ఈ ఫోన్‌పే ఫీచర్‌తో  తెలుసుకోవచ్చు

phone pay

స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ ఫోన్‌పే ఉపయోగిస్తున్నారు. పెరుగుతోన్న యూజర్లకు అనుగుణంగానే ఫోన్‌పే ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఫోన్‌పై పూర్తిగా అప్డేట్‌ అయిన విషయం తెలిసిందే. కేవలం యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ మాత్రమే కాకుండా పలు రకాల కొత్త ఫీచర్లను సైతం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తీసుకొచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

24

క్రెడిట్‌ కార్డులు, లోన్స్‌ తీసుకునే వారికి ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా మనం తీసుకునే లోన్స్‌, క్రెడిట్‌ కార్డులపైనే మన క్రెడిట్‌ స్కోర్‌ ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అయితే ఎంత లోన్‌ తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ ఎంత తగ్గుతుంది.? ఎంత లిమిట్‌ ఉండే క్రెడిట్‌ కార్డు తీసుకుంటే స్కోర్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది.? లాంటి విషయాలు తెలుసుకోవడం కష్టం. కానీ ఫోన్‌ పేలో వచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో ఇది చాలా సులభం. 
 

34

* ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో ఫోన్‌పే యాప్‌ను ఓపెన్‌ చేయండి. 

* ఆ తర్వాత కిందికి స్క్రోల్‌ చేసి లోన్స్‌ అనే సెక్షన్‌ను ఓపెన్‌ చేయాలి. 

* లోన్స్‌ను సెలక్ట్‌ చేసుకొని కిందికి స్క్రోల్‌ చేస్తే క్రెడిట్‌ స్కోర్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. మొదటి సారి ఫోన్‌పే ఇన్‌స్టాల్ చేసుకున్న వారికి 'గెట్‌ యువర్‌ క్రెడిట్‌ స్కోర్‌' అని కనిపిస్తుంది. సంబంధిత వివరాలు అందిస్తే మీ క్రెడిట్‌ స్కోర్‌ వస్తుంది. 
 

44

* క్రెడిట్ స్కోర్‌ను క్లిక్‌ చేయగానే మీ క్రెడిట్‌ స్కోర్‌ ఎంత ఉందో కనిపిస్తుంది. దాని కిందే.. 'సీ హౌ యువర్‌ క్రెడిట్‌ స్కోర్‌ ఛేంజెస్‌' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 

* ఇందులో కొత్త లోన్‌, క్రెడిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు చెల్లించకపోతే ఏమవుతుంది, క్రెడిట్‌ కార్డును క్లోజ్‌ చేస్తే అనే ఆప్షన్స్‌ కనిపిస్తాయి. 

* మీరు సెలక్ట్‌ చేసుకున్న దాన్ని బట్టి మీ క్రెడిట్‌ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవచ్చు. దీనిబట్టి మీ ఫైనాన్షియల్‌ ప్లానింగ్స్‌ చేసుకోవచ్చన్నమాట. 

Read more Photos on
click me!

Recommended Stories