Petrol Rate: లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ. 1.50 పైసలు మాత్రమే...ఎప్పుడో...ఎక్కడో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..?

First Published | Aug 9, 2023, 6:13 PM IST

భారతదేశంలో, పెట్రోల్ ధర లీటరుకు రూ. 110 దాటితే..కానీ ప్రపంచంలోని అనేక దేశాల్లో మంచి నీటి కంటే తక్కువ ధరకే పెట్రోల్ చౌకగా లభిస్తోంది.  భారత మార్కెట్‌లో ఒక లీటర్ వాటర్ బాటిల్ రూ. 20కి దొరుకుతుంది, అయితే వెనిజులాతో సహా చాలా దేశాల్లో పెట్రోల్ ధరలు అంత కంటే చాలా తక్కువగా ఉన్నాయి.

వెనిజులాలో అతి తక్కువ ధరకే పెట్రోల్ లభిస్తుంది
దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న వెనిజులాలో ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్ లభిస్తుంది. వెనిజులాలో పెట్రోలు లీటరుకు రెండు రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.1.50 మాత్రమే.
 

ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.4.50
ముడి చమురు ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలలో ఇరాన్ ఒకటి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 4.50. భారత్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ఇరాన్ ముడి చమురును ఎగుమతి చేస్తోంది.


petrol

అంగోలాలో లీటర్ పెట్రోల్‌కు రూ.17.82
నైరుతి ఆఫ్రికాలోని అంగోలా, చమురు, బంగారు గనులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముడి చమురు ఉత్పత్తి కారణంగా అక్కడ పెట్రోలు ధర చాలా తక్కువగా ఉంది. అంగోలాలో లీటర్ పెట్రోల్‌ ధర 17.82 మాత్రమే

నాలుగో స్థానంలో అల్జీరియా
చౌకైన పెట్రోల్ పరంగా, ఆఫ్రికన్ దేశం అల్జీరియా పేరు నాల్గవ స్థానంలో ఉంది. అల్జీరియాలో ప్రజలు పెట్రోల్ కోసం కేవలం రూ.25.15 మాత్రమే చెల్లించాలి.

కువైట్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.25
చౌకైన పెట్రోల్‌లో ప్రపంచంలోనే కువైట్ ఐదవ స్థానంలో ఉంది. కువైట్‌లో ప్రజలు ఒక లీటర్ పెట్రోల్‌కు రూ.25.25 మాత్రమే చెల్లించాలి. ఇరాన్ మాదిరిగానే, కువైట్ కూడా ముడి చమురును ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఒకటి. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ముడి చమురును ఎగుమతి చేస్తుంది. 
 

Petrol Price Down

పాకిస్థాన్‌లో రూ.273 పెట్రోల్
ప్రపంచంలోని చాలా దేశాల్లో, నీటి కంటే తక్కువ ధరలో పెట్రోల్ లభిస్తుంది. అదే సమయంలో పెట్రోలు, డీజిల్ ధరలపై పాకిస్థాన్‌లో దుమారం రేగుతోంది. పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్‌కు రూ.272.95 చెల్లించాల్సి ఉండగా, లీటర్ డీజిల్‌కు రూ.273.40 చెల్లించాల్సి ఉంది.

Latest Videos

click me!