కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముద్రా రుణాల ద్వారా దేశంలోని చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తుంది తద్వారా వారు జీవనోపాధిని పొందేందుకు ఈ ముద్ర లోన్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. ఎలాంటి తనఖా లేకుండానే ముద్ర లోన్స్ ద్వారా మీరు రుణాలను పొందవచ్చు అంతేకాదు వీటిని అతి సులభ వాయిదాలలో చెల్లించుకునే వీలుంది. వడ్డీ రేటు కూడా బయట ప్రైవేటు వడ్డీలతో పోల్చి చూస్తే చాలా తక్కువ. ఇప్పటికే కోట్లాదిమంది ప్రజలు ముద్ర రుణాలను తీసుకొని తమ వ్యాపారాలను ప్రారంభించి ప్రతి నెల చక్కటి ఆదాయం పొందుతున్నారు.