Shravana Masam: శ్రావణ మాసంలో బంగారం కొనేవారికి గుడ్ న్యూస్...ఆగస్టు చివరికి భారీగా పతనం అయ్యే చాన్స్.

First Published | Aug 9, 2023, 5:45 PM IST

ఆగస్టు 17వ తారీకు నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది శ్రావణమాసం అంటే అందరికీ గుర్తొచ్చేది బంగారమే మీరు బంగారం కొనుగోలు చేస్తున్నట్లయితే శ్రావణమాసంలో ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే శ్రావణమాసంలో బంగారం ధరలు ఈసారి తగ్గే అవకాశం కనిపిస్తోంది.

 ఈ సంవత్సరం అంతర్జాతీయంగా ఉన్న పరిణామాల కారణంగా బంగారం ధరలు భారీగా పతనం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇదే ట్రెండు కొనసాగితే బంగారం ధరలు 55000 సమీపంలోకి పతనం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

సాధారణంగా భారతీయులు శ్రావణమాసం  చాలా పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా లక్ష్మీదేవి ఈ మాసంలో ప్రతి ఇంట్లోనూ కొలువై ఉంటుందని భావిస్తూ ఉంటారు అందుకే లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనటువంటి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఈ నెలలోనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మధ్య తరగతి వర్గాలు సైతం ఇసుమంతైన బంగారం కొనేందుకు ఈ నెలలో ఖర్చు చేస్తూ ఉంటాయి. 


అయితే బంగారం ధరలు గడచిన నెల రోజులుగా మనం గమనించినట్లయితే భారీగా తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు.  ఈ నేపథ్యంలో బంగారం ధరలు శ్రావణమాసం ప్రారంభం నాటికి మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.  బంగారం ధరలు 60 వేల సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి.  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం ఉదయం హైదరాబాదులో 60,050 రూపాయలు పలికింది. 
 

గడచిన వారం రోజుల ట్రెండును మనం గమనించినట్లయితే, బంగారం ధరలు భారీగా తగ్గి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధరలు  శ్రావణమాసంలో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.  దీంతో పసిడిప్రియలు పండగ చేసుకుంటున్నారు.  గత నెలలో బంగారం ధర ఏకంగా 62000 దాటింది అక్కడి నుంచి పోల్చినట్లయితే ఈ నెలలో 60 వేలకు దిగివచ్చింది అంటే దాదాపు 2000 రూపాయలు బంగారం ధర తగ్గినట్లు మనం గమనించవచ్చు. 

అంతర్జాతీయంగా గమనించినట్లయితే అమెరికాలో ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు మళ్లీ పెంచుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇటీవలే ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచింది.  ఈ నేపథ్యంలో అమెరికా బాండ్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఫలితంగా బంగారం మీద పెట్టినటువంటి పెట్టుబడులను తగ్గిస్తున్నారు.  ఇప్పటివరకు బంగారం పై సంపాదించిన లాభాలను ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు ఫలితంగా పసిడి ధరలు బహిరంగ మార్కెట్లో తగ్గుముఖం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 

పసిడి ధరలు ఇదే రేంజులో తగ్గినట్లయితే ఈ నెల చివరి నాటికి బంగారం ధరలు రూ. 56,000 సమీపంలో తగ్గి వచ్చే అవకాశం ఉంది. శ్రావణమాసంలో మీరు బంగారం షాపింగ్ చేయదలుచు కుంటే మాత్రం కొద్ది జాగ్రత్తలు పాటిస్తే మంచిది.  ముఖ్యంగా  బంగారం కొనుగోలు చేసే సమయంలో తూకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఒక మిల్లీగ్రామ్ తేడా వచ్చిన లేరు వేలల్లో నష్టపోయే అవకాశం ఉంది. 
 

Latest Videos

click me!