ఇంధన ధరలు సుంకాలతో సహా లెక్కించబడతాయి. అందువల్ల ప్రతి రాష్ట్రం నుండి రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. వీటిలో వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైనవి ఉంటాయి.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు - ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) అండ్ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) - మార్కెట్‌లో దాదాపు 90 శాతం నియంత్రణలో ఉన్నాయి.