ఎందుకంటే ఎయిర్ ఇండియా ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. యూకేతో సహా యూరప్‌లోని ఐదు నగరాలకు సెలెక్ట్ చేసిన రూట్లలో ఎయిర్ ఇండియా భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది.
మీ చేతిలో రూ.40,000 ఉంటే కోపెన్‌హాగన్ (డెన్మార్క్), లండన్ హీత్రో (యుకె), మిలన్ (ఇటలీ), పారిస్ (ఫ్రాన్స్), వియన్నా (ఆస్ట్రియా)లకు వెళ్లవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. మీరు వన్ వే రూట్ సెలెక్ట్ చేసుకుంటే టికెట్ ధర రూ. 25,000 అని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.
అక్టోబర్ 14 వరకు ఈ ప్రత్యేక ఛార్జీల విమానాలను బుక్ చేసుకోవచ్చు. అయితే డిసెంబర్ 15 లోపు ప్రయాణానించేందుకు మాత్రమే బుకింగ్‌లు చేసుకోవచ్చని కూడా ప్రకటనలో పేర్కొంది.
ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, iOS అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ అండ్ ఆథరైజేడ్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. లిమిటెడ్ సీట్స్ కాబట్టి ముందుగా వచ్చిన వారికి ముందుగా ప్రాధాన్యత ఇస్తూ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌లైన్స్ తెలిపింది.
ప్రస్తుతం, ఎయిర్ ఇండియా ఢిల్లీ, ముంబై నుండి ఈ ఐదు యూరోపియన్ నగరాలకు ప్రతి వారం 48 నాన్-స్టాప్ విమానాలను నడుపుతోంది.
వివిధ నగరాల్లో వర్తించే ఎక్స్చేంజ్ రేట్లు, పన్నుల కారణంగా రేట్లు కొద్దిగా మారవచ్చని గమనించండి.