"ఉగ్రవాద సంస్థలకు చోటు లేదు": ప్రో-హమాస్ అకౌంట్స్ తొలగించిన ట్విట్టర్..

First Published | Oct 13, 2023, 11:23 AM IST

కాలిఫోర్నియా: ఇజ్రాయెల్‌పై  హమాస్ దాడుల తర్వాత, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విటర్‌) "ఉగ్రవాద సంస్థలకు Xలో చోటు లేదు" అని పేర్కొంటూ హమాస్ అనుబంధిత అకౌంట్స్ వందల కొద్దీ తొలగించింది.
 

"X పబ్లిక్ కన్వెర్జేషన్ సర్వీస్ అందించడానికి కట్టుబడి ఉంది, ప్రత్యేకించి ఇలాంటి క్లిష్టమైన క్షణాలలో  X  ద్వారా వ్యాప్తి చెందే ఏదైనా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను  పరిష్కరించడం ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటుంది. తీవ్రవాద సంస్థలు లేదా  తీవ్రవాద గ్రూప్స్ కి X లో స్థానం లేదు అండ్  ఆక్టీవ్ గ్రూప్స్ తో  సహా రియల్  టైంలో  ఇలాంటి  అకౌంట్స్  తీసివేయడం  కొనసాగుతుంది" అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్   CEO లిండా యాకారినో అన్నారు.
 

Xలో తప్పుడు సమాచార వ్యాప్తిని ఎదుర్కోవాలని ఇంకా కొత్త EU ఆన్‌లైన్ కంటెంట్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాలని కోరుతూ Elon Muskకు యూరోపియన్ యూనియన్ పరిశ్రమ చీఫ్ థియరీ బ్రెటన్ కోరారు. యూరోపియన్ యూనియన్‌లో చట్టవిరుద్ధమైన కంటెంట్ అండ్  తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో ట్విట్టర్ వినియోగంపై బ్రెటన్ ఆందోళన వ్యక్తం చేశారు.
 

Latest Videos


కొత్తగా అమలు చేయబడిన EU   డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA) ప్రకారం, X అండ్  Meta's Facebook వంటి బిగ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడానికి ఇంకా ప్రజాల భద్రత  కోసం  మరింత యాక్టీవ్  చర్యలు తీసుకోవాలి.

ఇజ్రాయెల్‌  హమాస్ దాడి తరువాత పరిస్థితిని తక్షణమే అంచనా వేయడానికి X లీడర్షిప్ గ్రూప్  ఏర్పాటు చేసిందని యాకారినో నొక్కిచెప్పారు.

ఇదే విధమైన చర్యలో థియరీ బ్రెటన్ అక్టోబరు 9న మెటాకు హెచ్చరిక జారీ చేసింది, ఇజ్రాయెల్ దాడి తర్వాత   X  ద్వారా వ్యాపించిన తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యల గురించి సమాచారాన్ని అందించడానికి కంపెనీకి 24 గంటల సమయం ఇచ్చింది.
 

ముఖ్యంగా అక్టోబర్ 7న హమాస్ దాడితో ఇజ్రాయెల్‌లో మరణించిన వారి సంఖ్య 1,300 కి పెరిగింది, దాదాపు 3300 మంది గాయపడ్డారు, ఇందులో 28 మంది పరిస్థితి తీవ్ర విషమంగా, 350 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు హిబ్రూ మీడియా నివేదికలపై  టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది.

హమాస్ దాడి సమయంలో దాదాపు 150 మంది అపహరణకు గురై గాజా స్ట్రిప్‌కు తీసుకెళ్లిన వారి భవితవ్యం ఇంకా అస్పష్టంగా ఉందని నివేదిక పేర్కొంది.

click me!