నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.12 వద్ద నిలిచింది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పడిపోతే.. యుపీఎల్, బిపీసీఎల్, ఒఎన్‌జీసీ, ఐఓసిఎల్, ఎల్ & టి షేర్లు భారీగా లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ మినహా ఇతర అన్ని సెక్టోరల్ సూచీలు ఎరుపురంగులో ముగిశాయి.
“వచ్చే వారం ఆర్‌బిఐ సమావేశం జరగనున్న నేపథ్యంలో బెంచ్‌మార్క్ సూచీలు హెవీవెయిట్‌ల నష్టాల కారణంగా వచ్చిన మొత్తం లాభాలను వదులుకున్నాయి. ఇదిలా ఉంటే, భారత్ ఒమిక్రాన్ కేసులను నివేదించడంతో పెట్టుబడిదారులు జాగ్రత్త వహిస్తున్నారు” అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.