Personal Loan: డబ్బుతో ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. ఇప్పటికే పర్సనల్ లోన్ ఉన్నా టాప్ అప్ తీసుకోవచ్చు. కాని లోన్ తీసుకొనే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇప్పటికే పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి అదనపు డబ్బును అప్పుగా తీసుకోవడాన్ని పర్సనల్ లోన్ టాప్-అప్ అంటారు. ఇది కొత్త లోన్ కాదు. ఇప్పటికే ఉన్న లోన్ పై అదనంగా తీసుకోవడం మాత్రమే. ఇది అందరికీ ఇవ్వరు. నమ్మకమైన కస్టమర్లకు మాత్రమే బ్యాంకులు ఇస్తాయి. అది కూడా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి.
26
కొత్తగా అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు
మీ ప్రస్తుత లోన్‌పై అదనంగా డబ్బు పొందే వెసులుబాటునే పర్సనల్ లోన్ టాప్-అప్ అంటారు. దీనికోసం కొత్తగా లోన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రస్తుత లోన్ ఇచ్చిన బ్యాంకు నుండే దీన్ని పొందవచ్చు. అయితే ఈ లోన్ పొందాలంటే మీరు ముందుగా తీసుకున్న పర్సనల్ లోన్ కనీసం 6 నుండి 12 నెలల ఈఎంఐలు కరెక్ట్ గా కట్టి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే బ్యాంకులు టాప్-అప్ ఇస్తాయి.
36
అత్యవసర పరిస్థితులకు టాప్ అప్ వాడుకోవచ్చు
మీ కేవైసీ వివరాలు (PAN, Aadhaar, repayment history) బ్యాంకు వద్ద ఉండటం వల్ల ఈ లోన్ త్వరగా, సులభంగా లభిస్తుంది. వైద్య అత్యవసరాలు, ఇంటి మరమ్మతులు, రుణ ఏకీకరణ వంటి అవసరాలకు దీన్ని ఉపయోగించవచ్చు.
వడ్డీ రేటు సాధారణంగా 10% నుండి 14% వరకు ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే వడ్డీ తక్కువగా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. లోన్ కాలవ్యవధి సాధారణంగా మీ పాత లోన్ మిగిలిన కాలం వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు 60 నెలల వరకు ఇస్తాయి.
పర్సనల్ లోన్ టాప్ అప్ పొందాలంటే మంచి క్రెడిట్ హిస్టరీ కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా 750 కంటే ఎక్కువ సిబిల్ ఉండాలి. ఇప్పటికే తీసుకున్న పర్సనల్ లోన్ ఈఎంఐలు కరెక్ట్ గా కట్టగలుగుతున్నారు కాబట్టి టాప్ అప్ కి కూడా ఈఎంఐ కట్టే సామర్థాన్ని మీరు కలిగి ఉండాలి. ఆ విధంగా ఆదాయ మార్గం ఉన్న వాళ్లు మాత్రమే టాప్ అప్ తీసుకోవాలి.
56
ఎలా అప్లై చేసుకోవాలి?
టాప్ అప్ కావాల్సిన వారు పర్సనల్ లోన్ ఇచ్చిన బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో కూడా బ్యాంకు వెబ్ సైట్ కి వెళ్లి అప్లై చేయొచ్చు. మీ ఆర్థిక అవసరాలు పెరిగితే అవి తీర్చుకోవడానికి టాప్-అప్ లోన్ ఉపయోగపడుతుంది. ఆకస్మిక ఖర్చులు వస్తే టాప్-అప్ లోన్ ఉపయోగపడుతుంది. పెద్ద పెట్టుబడి పెట్టాలన్నా, కొత్త ఆస్తి కొనాలన్నా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
66
అనవసరంగా తీసుకుంటే అవస్థలే
ఏదైనా అత్యవసరం అయితేనే టాప్ అప్ లోన్ తీసుకోవాలి. తీసుకున్న డబ్బును ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉపయోగించాలి. లేకపోతే ఈఎంఐల బర్డెన్ పెరిగిపోతుంది. అప్పు మీద అప్పు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు మరిన్ని పెరిగిపోతాయి.