Credit card: ఫోన్‌పేతో క్రెడిట్ కార్డు బిల్లు ఎలా చెల్లించాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

Published : Jun 13, 2025, 04:27 PM ISTUpdated : Jun 13, 2025, 04:28 PM IST

ప్ర‌స్తుతం క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. అయితే క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ చేసే విష‌యంలో కొంద‌రు ఇబ్బందులు ప‌డుతుంటారు. డ్యూ డేట్ మ‌ర్చిపోతుంటారు. అయితే ఫోన్‌పే ద్వారా చాలా సుల‌భంగా క్రెడిట్ కార్డు బిల్స్ పేమెంట్ చేయొచ్చ‌ని మీకు తెలుసా? 

PREV
15
ఫోన్‌పేలో క్రెడిట్ కార్డు బిల్ ఎలా చెల్లించాలంటే.?

* ముందుగా ఫోన్‌పే యాప్‌ను ఓపెన్ చేయాలి.

* అనంత‌రం ‘Recharge & Pay Bills’ సెక్షన్‌కి వెళ్లండి.

* ఈ విభాగంలో బిల్స్ చెల్లించే అన్ని ఆప్షన్లు కనిపిస్తాయి.

* వీటిలో ‘Credit Card’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించేందుకు ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

25
కార్డ్ వివ‌రాలు అందించాలి.

* అనంత‌రం మీ క్రెడిట్ కార్డు వివ‌రాల‌ను అందించాలి.

* ఇందులో భాగంగా మీ కార్డ్ నెంబర్, సీవీవీ (CVV), మొత్తం చెల్లించాల్సిన అమౌంట్‌ వంటి వివరాలు నమోదు చేయండి.

* త‌ర్వాత పేమెంట్ మోడ్‌ను ఎంచుకోండి. యూపీఐ, లింక్ చేసిన బ్యాంక్ ఖాతా లేదా వాలెట్‌ ద్వారా చెల్లించవచ్చు.

* చివ‌రిగా కన్ఫర్మ్ చేయండి. వివరాలు పరిశీలించి తప్పులుంటే సరిదిద్దుకుని, చెల్లింపు పూర్తి చేయండి.

35
ఫోన్‌పేలో క్రెడిట్ కార్డు బిల్ చెల్లిస్తే లాభాలేంటి.?

* ఎక్కడినుంచైనా చెల్లింపు అవకాశం అది కూడా క్ష‌ణాల్లో పేమెంట్ పూర్తి చేయొచ్చు.

* యూపీఐ, బ్యాంక్ ఖాతా, వాలెట్ ద్వారా చెల్లించే అవ‌కాశం ఉంటుంది.

* సురక్షిత లావాదేవీలు. టోకనైజేషన్, UPI PINలతో అదనపు భద్రత ల‌భిస్తుంది.

45
ఫైన్ చెల్లించాల్సిన పని ఉండదు

* బిల్ రిమైండర్ ఫీచర్ ద్వారా బిల్ డ్యూట్ తేదీలను మర్చిపోకుండా గుర్తు చేసే సదుపాయం ఉంటుంది. దీంతో మీరు జరిమాన చెల్లించాల్సిన పని ఉండదు. 

* ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు, హిడెన్ ఛార్జీలు ఉండ‌వు.

55
ఫోన్‌పేతో క్రెడిట్ కార్డును ఎలా ఉప‌యోగించాలి.?

* ఫోన్‌పేలో యూపీఐ పద్ధతిలో RuPay క్రెడిట్ కార్డును లింక్ చేయడాన్ని కూడా అనుమతిస్తుంది.

* ఇందుకోసం ‘My Money’ ట్యాబ్‌కి వెళ్లి కార్డ్‌ను యాడ్ చేయండి.

* యూపీఐ పిన్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. నేరుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్స్ చేసుకోవ‌చ్చు.

Read more Photos on
click me!

Recommended Stories