Travel Insurance: ట్రావెల్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం! ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొనేటప్పుడు బీమా ఇలా తీసుకోండి

Published : Jun 13, 2025, 04:12 PM IST

ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ ఎంత అవసరమో జరుగుతున్న ప్రమాదాలు తెలియజేస్తున్నాయి. ఫ్లైట్, ట్రైన్, బస్ ఇలా ఏదైనా టికెట్ బుక్ చేసుకొనేటప్పుడే ఇన్యూరెన్స్ తీసుకోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా విమానాలు, రైళ్లు ఆలస్యమైనప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. 

PREV
16
80 శాతం మంది ప్రయాణ బీమా తీసుకోరు

విమానం, రైలు, బస్సు ఇలా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ లో వెళ్లే ప్రయాణికులు 80 శాతం మంది ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదని సర్వేలు చెబుతున్నాయి. ఇన్సూరెన్స్ అంటే లైఫ్, హెల్త్ అని మాత్రమే అనుకుంటారు. కాని ప్రయాణ బీమా కూడా అవసరం అని చాలా మందికి తెలియదు. 

అపశకునంగా భావిస్తారు

అసలు ఇన్సూరెన్స్ తీసుకోవడమే చాలా మంది అపశకునంగా భావిస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల బలవంతం మీద తీసుకొనే వారే ఎక్కువగా ఉంటారు. ఇక ప్రయాణ బీమా తీసుకోవాలంటే ఏదైనా జరుగుతుందని ముందే భయపడి తీసుకోరు. 

26
ప్రమాదం ఎప్పుడైనా జరగొచ్చు

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని గుర్తు చేసేలా అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగింది. ఇందులో మరణించి వారిలో ఎంతమందికి ప్రయాణ బీమా ఉందనేది ప్రస్తుతానికి తెలియదు. కాని ప్రయాణ బీమా ఉన్న వారికి మరణం సంభవిస్తేనే కాకుండా, గాయాలైనా కూడా ప్రయాణ బీమా ఆర్థికంగా ఎంతో సహాయంగా చేస్తుంది. 

బస్సు, ట్రైన్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొనేటప్పుడే అక్కడున్న బీమా ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ప్రయాణ బీమా తీసుకోవచ్చు. దీనికి అంత భారీగా కూడా ఖర్చు కాదు. విమాన టికెట్ బుకింగ్ చేసేటప్పుడే ప్రయాణ బీమా తీసుకోవడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. 

36
టికెట్ బుక్ చేసేటప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు

ఆన్‌లైన్ బుకింగ్ సైట్లలో టికెట్ బుక్ చేసేటప్పుడు నేరుగా ఇన్సూరెన్స్ ఆప్షన్ ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకి MakeMyTrip, Yatra, IRCTC Air, Cleartrip, Goibibo వంటి సైట్లలో టికెట్ బుకింగ్ చేసేటప్పుడే ప్రయాణ బీమా తీసుకోవచ్చు.

* ముందుగా మీ ప్రయాణ వివరాలు అంటే.. ఫ్లైట్ నేమ్, డేట్, ప్రయాణికుల వివరాలు నమోదు చేయండి.

* "ట్రావెల్ ఇన్సూరెన్స్" లేదా "ప్రమాద బీమా" అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. కొన్ని సైట్లలో బీమా ముందే యాడ్ అయి ఉంటుంది. మీరు వద్దనుకుంటే తీసేయవచ్చు.

* సాధారణంగా బీమా ఖర్చు రూ.40 నుంచి రూ.200 వరకు ఉంటుంది. టికెట్ డబ్బులతో పాటు బీమా ఖర్చు కూడా కలిపి టికెట్ బుక్ అవుతుంది. 

46
ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు బీమా ఎలా తీసుకోవాలంటే..

Air India, IndiGo, Vistara, SpiceJet లాంటి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

బుకింగ్ పేజీలో "ప్రయాణ రక్షణ" లేదా "బీమా" అనే లింక్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సంస్థలు TATA AIG, ICICI Lombard, Go Digit వంటి సంస్థలతో కలిసి బీమా అందిస్తాయి. ఇన్సూరెన్స్ ఇచ్చే సంస్థ గురించి, దాని కండీషన్స్ గురించి పూర్తిగా చదివి టికెట్ బుక్ చేసుకోండి. 

విడిగా కూడా ప్రయాణ బీమా తీసుకోవచ్చు

విమాన టికెట్ బుక్ చేసిన తర్వాత కూడా విడిగా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ICICI Lombard, HDFC ERGO, Digit, Tata AIG ఇలా అనేక సంస్థలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. మీరు మీకు నచ్చిన బీమా సంస్థ వెబ్‌సైట్ కి వెళ్లి మీ ఆర్థిక పరిస్థితికి తగ్గ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించి పాలసీ డాక్యుమెంట్ ను ప్రింట్ తీసి పెట్టుకోండి. 

56
నామినీ వివరాలు స్పష్టంగా ఉండాలి

ఇతర సౌకర్యాల కోసం బీమా తీసుకోవడం కంటే మరణం, వైద్య ఖర్చులకు బీమా కల్పించే పథకాన్ని ఎంచుకోవడం మంచిది. నామినీ వివరాలు స్పష్టంగా ఇవ్వాలి. పాలసీ డాక్యుమెంట్లను డిజిటల్‌గా కుటుంబ సభ్యులకు పంపాలి. ప్రయాణ వివరాలు, ఖర్చుల గురించి కుటుంబ సభ్యులకు చెప్పడం ముఖ్యం.

66
ఫ్లైట్ క్యాన్సిల్ అయినా డబ్బులు వస్తాయి

విమాన ప్రమాదాల వల్ల ప్రాణనష్టం, తీవ్ర గాయాలకు కావచ్చు. కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీలు కుటుంబానికి రక్షణ కల్పిస్తాయి. విమానం ఆలస్యం అయినా లేదా రద్దు అయినా కూడా కొన్ని బీమా సంస్థలు డబ్బు తిరిగి ఇప్పిస్తాయి. విదేశీ ప్రయాణంలో ఆరోగ్య సమస్యలు వస్తే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. ప్రమాదవశాత్తు విమాన ప్రమాదం జరిగితే కుటుంబానికి బీమా నగదు ఆర్థిక భరోసానిస్తుంది. ఫ్లైట్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు. కానీ నష్టాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories