OYO: ఓయో రూమ్‌కి వెళ్లే వారికి పండగలాంటి వార్త.. ఈ విషయం తెలిస్తే గంతేస్తారు.

Published : Sep 02, 2025, 06:02 PM IST

హోటల్ గదులపై విధించే GST రేట్లలో ప్రభుత్వం పెద్ద మార్పులు చేయబోతోంది. దీని వల్ల OYO సహా అనేక హోటళ్లలో గదుల ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ప్రస్తుతం హోటల్ గదులపై ఉన్న GST శ్లాబులు

ప్రస్తుతం హోటల్ గదుల ధర ఆధారంగా మూడు రకాల పన్ను శ్లాబులు ఉన్నాయి.

* రూ.1000 లోపు గదులపై ఎటువంటి GST లేదు.

* రూ.1000 – రూ.7500 మధ్య గదులపై 12% GST విధిస్తున్నారు.

* రూ.7500 కంటే ఎక్కువ ధర గల గదులపై 18% GST చెల్లించాలి.

* ఈ కారణంగా, రూ.5000–6000 రేంజ్‌లో గదులు తీసుకునే వారికి బిల్లు ఎక్కువగా వచ్చేది.

DID YOU KNOW ?
కొత్త GSTలో మార్పులు
కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం కొత్త‌గా రెండు జీఎస్‌టీ శ్లాబుల‌ను మాత్ర‌మే అమ‌లు చేయ‌నుంది. దీంతో ధరలు తగ్గనున్నాయి.
25
కొత్త GSTలో మార్పులు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం కొత్త‌గా రెండు జీఎస్‌టీ శ్లాబుల‌ను మాత్ర‌మే అమ‌లు చేయ‌నుంది.

* మొదటిది 5% GST

* రెండవది 18% GST

దీని వల్ల మధ్య స్థాయి ధర గల గదులు తీసుకునే వారికి నేరుగా ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు 12% చెల్లించాల్సి ఉండేది, ఇకపై కేవలం 5% మాత్రమే చెల్లిస్తారు.

35
ధ‌ర ఎంత వ‌ర‌కు త‌గ్గుతుంది.?

ఉదాహ‌ర‌ణ‌కు ఒక హోటల్ గది ధర రూ.5000 అనుకుందాం. పాత వ్యవస్థలో: 12% GST = రూ.600గా ఉంటే కొత్త వ్యవస్థలో 5% GST రూ.250 అవుతుంది. అంటే ఒకే గదిపై రూ.350 ప్రత్యక్ష పొదుపు లభిస్తుంది. ఇది OYO, Treebo, FabHotels వంటి అన్ని మధ్యస్థాయి హోటళ్లకు వర్తిస్తుంది.

45
లగ్జరీ గదులకు మార్పు ఉండదు

రూ.7501 పైబడిన లగ్జరీ గదులపై మాత్రం మునుపటిలాగే 18% GST కొనసాగుతుంది. కాబట్టి పెద్ద హోటళ్లలో, ఫైవ్‌స్టార్ రూమ్‌లలో ఎలాంటి తగ్గింపు ఉండదు. ఈ మార్పు పూర్తిగా మధ్యతరగతి, బడ్జెట్ ట్రావెలర్ల కోసం ఉద్దేశించారు.

55
వినియోగదారులకు, పర్యాటక రంగానికి లాభాలు

ఈ GST తగ్గింపు అమలులోకి వస్తే సాధారణ వినియోగదారుల ఖర్చు తగ్గుతుంది. పర్యాటకులు ఎక్కువగా హోటళ్లలో బస చేయడానికి అవ‌కాశం ల‌భిస్తుంది. దీంతో హోటల్ పరిశ్రమలో బుకింగ్స్ పెరిగి, వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఇక పన్ను తగ్గింపుతో దేశీయ పర్యాటక రంగం మరింత చురుకుగా మారే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories