నెలవారీ ఆదాయం 15 వేల రూపాయలు మాత్రమే ఉన్నవారు కూడా లక్షాధికారి కావచ్చు. ఇందుకోసం SIPలో పెట్టబడి పెట్టాల్సి వస్తుంది. నిజానికి SIP ఒక గొప్ప మార్గం అని చెప్పుకోవాలి.
SIP అనగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. ఇది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి సులువైన మార్గం. నిజానికి ఇది ఒక రకమైన డిజిటల్ పిగ్గి బ్యాంక్ అని చెప్పుకోవాలి. చిన్నచిన్న పెట్టుబడులు పెట్టడానికి సులువుగా వెనక్కి తీసుకోవడానికి సిప్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మీరు 100 రూపాయలు నుంచి కూడా సిప్ లో పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ జీతాలు పొందే వారికి ఎక్కువ లాభాలను ఇచ్చే పద్ధతి సిప్.
25
తక్కువ జీతం ఉన్నా..
15వేల రూపాయలు జీతం వచ్చేవారు పొదుపు చేసే పద్ధతి తెలియక ఇబ్బంది పడతారు. నిజానికి పదిహేను వేల రూపాయలు వచ్చేవారు కూడా త్వరగానే సిప్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లక్ష రూపాయలు కూడబెట్టవచ్చు. ఇక్కడ మేము 15 వేల రూపాయల జీతం వచ్చే వారు త్వరగా లక్ష రూపాయలు ఎలా సంపాదించాలో సిప్ లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో ఇచ్చాము.
35
నెలకి వెయ్యి రూపాయలు పొదుపు చేస్తే
15వేల రూపాయల జీతం వచ్చేవారు నెలకు 1000 రూపాయలు పొదుపు చేయాలి. ఈ వెయ్యి రూపాయలను సిప్ చేయాల్సి వస్తుంది. మీరు చేసిన ప్రతి 1000 రూపాయలపై 12 శాతం వడ్డీ రాబడి ఉంటుంది. మీరు ప్రతి నెల 1000 రూపాయలు సిప్ చేస్తే ఆరు సంవత్సరాల లో మీకు లక్ష రూపాయలు పొదుపు అవుతుంది. 2000 రూపాయలు సిప్ చేస్తే మీకు ఆరు సంవత్సరాల్లో రెండు లక్షలకు పైగా చేతికొచ్చే అవకాశం ఉంది.
అదే 3000 రూపాయలు చేస్తే నాలుగు లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పొదుపుపై 12 శాతం వడ్డీని అందిస్తుంది. ప్రతినెలా 1000 రూపాయలు సిప్ చేసే వారికి ఆరు సంవత్సరాల లో 1,06,000 రూపాయలు చేతికి వస్తుంది. అయితే మీరు అందులో పెట్టేది అసలు 72,000 మాత్రమే మిగతాది వడ్డీ. మీరు నెలకు 5000 రూపాయలు సిప్ చేయగలిగితే ఆరేళ్లలో మీ చేతికి ఐదు లక్షలకు పైగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో మీరు పెట్టే అసలు పెట్టుబడి 3,60,000 రూపాయలు మాత్రమే మిగతా లక్షన్నర పైగా వడ్డీయే పడుతుంది.
55
పొదుపు చేయక తప్పదు
తక్కువ పొదుపుతో ఎక్కువ లాభాలను పొందాలంటే రిస్కు లేని పద్ధతి సిప్. సిప్ లో ఎంత కాలం ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెడితే మీరు అంత ఎక్కువ లాభం పొందుతారు. ఉదాహరణకు మీరు నెలకు 1000 రూపాయల చొప్పున పదేళ్లపాటు పెట్టుబడి పెడితే మీకు వచ్చే రాబడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వడ్డీ 12 శాతం పడుతూ ఉంటుంది. కాబట్టి తక్కువ జీతమైనా కూడా కనీసం నెలకి 1000 రూపాయలు నుంచి 5 వేల రూపాయలలోపు పొదుపు చేసేందుకు సిప్ లో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించండి. ఇది మీకు ఎక్కువ లాభాన్ని అందిస్తుంది.