Oyo: క‌పుల్స్‌కి పండ‌గే.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఓయో

Published : Jun 10, 2025, 10:25 AM IST

ప్ర‌ముఖ హోట‌ల్ బుకింగ్ సంస్థ ఓయోకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌త్‌లో చిన్న స్టార్ట‌ప్‌గా మొద‌లైన ఈ సంస్థ ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న సేవ‌ల‌ను విస్త‌రించింది. 

PREV
15
హోట‌ళ్ల విస్త‌ర‌ణ పెంపు

ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ హాస్పిటాలిటీ రంగంలో దూసుకుపోతున్న ఓయో 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ నిర్వహించే హోటళ్ల విస్తరణను వేగవంతం చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం కంపెనీకి భారత్‌లో 1,300కి పైగా స్వయంగా నిర్వహించే హోటళ్లు ఉన్నాయి. వీటిని FY26 నాటికి 1,800కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం (FY25)లో ఈ సంఖ్య సుమారు 900 హోటళ్లుగా ఉంది.

25
బుకింగ్ రెవెన్యూలో రెట్టింపు లక్ష్యం

ఓయో కంపెనీ నిర్వహించే హోటళ్ల నుంచి వచ్చే బుకింగ్ ఆదాయాన్ని 22 శాతం నుంచి 44 శాతానికి పెంచాలని భావిస్తోంది. ఇది కంపెనీ మొత్త ఆదాయంలో భారీ వృద్ధికి దారితీస్తుందని అంచనా వేస్తున్నారు.

35
300కి పైగా న‌గ‌రాల‌కు

ప్రస్తుతం ఓయో కంపెనీ నడుపుతున్న‌ హోటళ్లు 124 నగరాల్లో ఉన్నాయి. FY26 నాటికి ఈ హోటళ్లను 300కి పైగా నగరాల్లో విస్తరించాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా మొహాలీ, ఫరిదాబాద్, జలంధర్, కటక్, ఆసన్సోల్, దార్జిలింగ్, మంగళూరు, కొల్లం, పోర్ట్ బ్లెయిర్, కాసరగోడ్, భిల్వారా, వాపి, జూనాగఢ్, జల్‌గావ్ న‌గ‌రాల్లో విస్త‌రించ‌నున్నారు.

45
రేటింగ్స్‌లో దూసుకుపోతున్న ఓయో

ఇత‌ర హోట‌ల్స్‌తో పోల్చితే ఓయో స్వ‌యంగా న‌డిపిస్తున్న వాటిలో రేటింగ్స్ అధికంగా ఉంటున్నాయి. గెస్టుల రేటింగ్: సగటున 4.6 (ఇతర హోటళ్ల సగటు 4.0)గా ఉంది.

అలాగే ఆక్యుపెన్సీ రేటు 2.7 రెట్లు ఎక్కువ ఉండ‌గా, రిపీట్ కస్టమర్ రేటు 1.3 రెట్లు ఎక్కువ ఉంటోంది. ఇందులో భాగంగానే ఓయో స్వ‌యంగా న‌డిపించే హోట‌ల్స్ సంఖ్య‌ను పెంచే దిశ‌గా దృష్టి సారించింది.

55
వ్యూహాత్మ‌క విస్త‌ర‌ణ

ఓయో ప్రధానంగా లీజర్ సిటీస్, పుణ్యక్షేత్రాలు, వ్యాపార ప్రాంతాలపై దృష్టి పెడుతోంది. అక్కడ హోటల్ అవసరాలు ఎక్కువగా ఉండటంతో, అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. 

ఇలా ఓయో రానున్న రోజుల్లో త‌న సొంత హోట‌ల్స్‌ను పెంచే దిశ‌గా అడుగులు వేస్తోంది. కాగా ఓయో త్వ‌ర‌లోనే ఐపీఓకి వెళ్లేందుకు స‌న్నాహాలు చేస్తున్న విష‌యం తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories