Oyo: మ‌రో కిర్రాక్ ప్లాన్ వేసిన ఓయో.. క‌పుల్స్‌కి పండ‌గే

Published : May 26, 2025, 10:57 AM ISTUpdated : May 26, 2025, 11:03 AM IST

ప్ర‌ముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయోకు ఎంత పాపులారిటీ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌త్‌లో స్టార్ట‌ప్ కంపెనీగా మొద‌లైన ఓయో ఇప్పుడు ఇత‌ర దేశాల్లోనూ విస్త‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

PREV
15
వ్యాపార విస్త‌ర‌ణ‌లో భాగంగా కీల‌క నిర్ణ‌యం:

గ్లోబల్ హాస్పిటాలిటీ రంగంలో దూసుకెళ్తున్న ఓయో ఇప్పుడు తన వ్యాపార పరిధిని మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది. ఇప్పటివరకు కేవ‌లం హోటల్ సేవలకే పరిమితమైన ఓయో ఇప్పుడు వెకేషన్ హోమ్స్, షార్ట్-టర్మ్ అద్దె గృహాల విభాగంలోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

ఇందులో భాగంగానే ఓయోకు చెందిన‌ వెకేషన్ హోమ్ యూనిట్ అయిన బెల్‌విల్లా బై ఓయో (Belvilla by OYO), ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ షార్ట్-టర్మ్ రెంటల్ కంపెనీ మేడ్‌కామ్‌ఫీని సొంతం చేసుకుంది. అయితే భార‌త్‌లో ఈ సేవలు అందుబాటులోకి వ‌స్తాయా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. దీంతో ఇక‌పై లాంగ్ వెకేష‌న్స్ లేదా త‌క్కువ కాలం అద్దె గ‌దులు కావాల‌నుకునే వారు చాలా సుల‌భంగా సేవ‌ల‌ను పొందొచ్చ‌న్న‌మాట‌.

25
జ‌న‌ర‌ల్ మీటింగ్‌లో ఆమోదం:

ఓయోకు ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు ఈ ఒప్పందం ఉప‌యోగ‌ప‌డ‌నుంది. డీల్‌ వివరాల ప్రకారం, ఈ కొనుగోలు నగదు, షేర్ల రూపంలో జ‌రిగింది. ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ ఇటీవల నిర్వహించిన ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్‌లో దీనికి ఆమోదం లభించింది.

ఓయో ఈ ఒప్పందంలో భాగంగా సుమారు 1.9 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను జారీ చేయనుందని తెలుస్తోంది. ఒక్కో షేరు విలువను 0.67 డాలర్లుగా నిర్ణయించారు. దీనికి అనుగుణంగా, ఓయో ప్రస్తుత విలువ దాదాపు 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.42,500 కోట్లు)గా అంచ‌నా వేశారు.

35
అస‌లు ఏంటీ మేడ్‌కామ్‌ఫీ.?

2015లో సబ్రినా బెథునిన్, క్విరిన్ ష్వైఘోఫర్ అనే ఇద్దరు ఔత్సాహికులు మేడ్‌కామ్‌ఫీని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆస్ట్రేలియాలో 1,200కిపైగా ప్రాపర్టీలను నిర్వహిస్తోంది. సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్ వంటి ప్రధాన నగరాల్లో సంస్థ కార్యాలయాలు ఉన్నాయి.

45
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో

అలాగే.. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, వెల్లింగ్‌టన్, హామిల్టన్ నగరాల్లోనూ మేడ్‌కామ్‌ఫీ సేవలు విస్తరించాయి. 2024లో సంస్థ 9.6 మిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించింది. ప్రధానంగా షార్ట్-టర్మ్ అద్దె ప్రాపర్టీల నిర్వహణ సేవలపై దృష్టిపెట్టిన‌ ఈ సంస్థ, ప్రాపర్టీ యజమానులకు అధిక ఆదాయాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఈ డీల్‌తో ఓయో.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కీలక మార్కెట్లలో ఎంట్రీ ఇవ్వ‌నుంది.

55
ఓయో గ్లోబ‌ల్ విస్త‌ర‌ణ ఇలా సాగుతోంది.

2019లో ఓయో యూరోపియన్ లేజర్ గ్రూప్‌ను కొనుగోలు చేసింది. అదే సమయంలో బెల్‌విల్లా బ్రాండ్‌ను సొంతం చేసుకుని “Belvilla by OYO”గా నడుపుతోంది. ఈ బ్రాండ్ ద్వారా యూరప్‌లో 20 దేశాల్లో 50,000కి పైగా వెకేషన్ హోమ్స్‌ను నిర్వహిస్తోంది.

అలాగే 2024 డిసెంబరులో, ఓయో G6 హాస్పిటాలిటీను 525 మిలియన్ డాల‌ర్ల‌కు కొనుగోలు చేసింది. దీని ద్వారా అమెరికా, కెనడాల్లో 1,500కి పైగా హోటల్స్ నెట్‌వర్క్‌లోకి వచ్చాయి. ఇప్పుడు MadeComfy కొనుగోలు కూడా ఓయో గ్లోబల్ ప్రెజెన్స్‌ను మరింత బలోపేతం చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories