Sunroof Cars: మీకు అదిరిపోయే సన్‌రూఫ్ కారు కావాలా? రూ.10 లక్షల లోపు లభించే 5 బెస్ట్ కార్లు ఇవిగో

Published : May 25, 2025, 03:37 PM IST

ఇప్పుడు కార్లలో సన్‌రూఫ్ అనేది అందరూ కోరుకునే ఫీచర్. ఇండియాలో అలాంటి కార్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. అందుకే కంపెనీలు కూడా సన్‌రూఫ్ ఉన్న ఎస్‌యూవీ కార్లను ఎక్కువగా తయారు చేస్తున్నాయి. రూ.10 లక్షల లోపు ధర ఉన్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
టాటా పంచ్

సేఫ్టీతో పాటు సన్‌రూఫ్ కావాలంటే టాటా పంచ్ మంచి ఆప్షన్. గత సంవత్సరం అత్యధికంగా అమ్ముడైన కార్లలో పంచ్ టాప్ లో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.35 లక్షలే. ఇంత తక్కువ ధరలోనూ సన్‌రూఫ్ మోడల్ లాంచ్ అయ్యింది. ఈ కారు 1.2 లీటర్ రివొట్రాన్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఉంది. గ్లోబల్ ఎన్‌సీఏపీ సేఫ్టీ రేటింగ్‌లో పంచ్ కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది. 

25
హ్యుండై ఎక్స్‌టర్

హ్యుండై ఎక్స్‌టర్ పూర్తిస్థాయి ఎస్‌యూవీ కాదు. ఇది హ్యాచ్‌బ్యాక్ లాంటిది. కానీ ఎస్‌యూవీలా డిజైన్ చేశారు. ఇండియాలో అతి తక్కువ ధరకు సన్‌రూఫ్ కలిగిన ఎస్‌యూవీ ఇదే. ఇందులో ఎక్స్‌టర్ ‘ఎస్ స్మార్ట్’ వేరియంట్ కేవలం రూ.7.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు సన్‌రూఫ్‌తో పాటు లభిస్తుంది. ఈ మోడల్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది.

35
హ్యుండై వెన్యూ

హ్యుండై తన కార్ల అమ్మకాలను పెంచుకోవడానికి చాలా ఫీచర్లు అందిస్తోంది. అందులో భాగంగా వెన్యూ మోడల్‌లో సన్‌రూఫ్ ఉంది. ఇది 1197 సీసీ 1.2 లీటర్ ఇంజిన్ కెపాసిటీని కలిగి ఉంది. 83 హార్స్‌పవర్, 113 Nm టార్క్ ఇస్తుంది. వెన్యూ E Plus వేరియంట్ మార్కెట్ లో రూ.8.32 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది.

45
మహీంద్రా XUV 3XO

హ్యుండై వెన్యూలాగే మహీంద్రా XUV 3XO లో కూడా సన్‌రూఫ్ ఉంది. ఈ మోడల్ లోని MX2 Pro వేరియంట్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. అందుకే ఇది 110 హార్స్‌పవర్, 200Nm టార్క్ ఇస్తుంది. దీని ధర రూ.9.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). మహీంద్రా XUV 3XO కి భారత్ NCAP 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది.

55
టాటా నెక్సాన్

ఇండియాలో బాగా ఫేమస్ అయిన ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌కి ఇప్పుడు సన్‌రూఫ్ ఫీచర్ తో లభిస్తోంది. ఇందులో 1.2 రివొట్రాన్ స్మార్ట్ ప్లస్ ఎస్ మోడల్‌లో సన్‌రూఫ్ ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.9.4 లక్షలు. దీని టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 118 హార్స్‌పవర్, 170 Nm టార్క్ ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories