మీ దగ్గర పాత 5 రూపాయల నోటు ఉంటే రూ.లక్ష మీవే

First Published | Sep 19, 2024, 10:38 AM IST

ఈ డిజిటల్ యుగంలో ఒక పాత ఐదు రూపాయల నోటు కూడా మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుందంటే మీరు నమ్మగలరా? ఒక చిన్న 5 రూపాయల నోటు వల్ల అంత అదృష్టం వస్తుందా అని మీరు ఆశ్చర్యపోతారు కూడా..  కానీ అది నిజం. పాత 5 రూపాయల నోటు వల్ల రూ.లక్షలు ఎలా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పాత కాలం నాటి నాణాలు, వస్తువులు, వివిధ దేశాల కరెన్సీ సేకరించడం కొంత మందికి ప్రత్యేక హాబీగా  ఉంటుంది. మనలో కూడా చాలా మంది మన చిన్ననాటి వస్తువులు దాచుకుంటాం. చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాలు, పెన్నులు, గ్రీటింగ్ కార్డులు, ఫ్రెండ్స్ కి రాసిన లెటర్స్, వాళ్లిచ్చిన గిఫ్టులు ఇలా అనేక వస్తువులు జాగ్రత్తగా ఉంచుకుంటాం. వాటిని ఎప్పుడైన చూసినప్పుడు మనకు ఆ చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకు వచ్చి చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇలాంటి సేకరణకు చెందినదే కరెన్సీ నోట్ల కలెక్షన్. ఇందులో చాలా రకాలు ఉంటాయి. కొందరు నాణాలు సేకరిస్తారు. మరికొందరు పాత కాలం నాటి నోట్లు కలెక్ట్ చేస్తారు. 

పాత విలువైన రూపాయల నోట్లు 

వీరిలో పాత కరెన్సీ నోట్లు.. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సీరియల్ నంబర్లు లేదా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న రూపాయల నోట్లు సేకరించి దాచిపెట్టుకున్న వారు ఇప్పుడు లక్షాధికారులు కాబోతున్నారు. అది ఎలాగంటే.. ఇలాంటి రేర్ ఐటమ్స్ కలెక్ట్ చేసే వారిలో కొందరు ఎంత డబ్బయినా ఖర్చుపెట్టి వాటిని కొనుక్కుంటారు. జనరల్ గా అలాంటి వారు పురాతన వస్తువులు వేలం వేసే కార్యక్రమాల్లో పాల్గొని వాటిని కొనుక్కుంటారు. ఇలాంటి వారు  ప్రపంచవ్యాప్తంగా ఉంటారు.

5 రూపాయల పాత నోట్లు 

ముఖ్యంగా పాత 5 రూపాయల నోట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నోట్లు దాని ప్రత్యేకమైన సీరియల్ నంబర్, దానిలోని కొన్ని ప్రత్యేక గుర్తులు లేదా చారిత్రక ప్రాముఖ్యత కారణంగానే మార్కెట్‌లో ఎక్కువ ధరను పొందుతున్నాయని ఈ రకమైన రూపాయల నోట్లను కొనుగోలు చేసే ఆసక్తి ఉన్నవారు చెబుతున్నారు.  

సీరియల్ నంబర్లు, ప్రత్యేక లక్షణాలు

పాత కరెన్సీ నోట్లలో 5 రూపాయల నోటుకు కాస్త ప్రత్యేక ఎక్కువే ఉంది. దాని సీరియల్ నంబర్, డిజైన్ తదితర అంశాలను బట్టి సేకరణదారులు వీటిని ఎక్కువ ధరకు కొంటారు. అదెలా అంటే.. 

సీరియల్ నంబర్ 786

786 సంఖ్యకు ఇస్లామిక్ మతంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ సంఖ్య ఉన్న నోట్లు సేకరించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పోటీపడుతుంటారు. మీ పాత రూ. మీ దగ్గర ఉన్న 5 నోటులో ఈ సీరియల్ నంబర్ ఉంటే దాని విలువ ప్రసుత్తం లక్ష రూపాయల వరకు పలుకుతుంది. 

Latest Videos


అరుదైన సీరియల్ నంబర్ కరెన్సీ

123456 వంటి సీరియల్ నంబర్‌లతో ఉన్న నోట్లు చాలా అరుదు. ఇలాంటివి ఎవరి దగ్గర ఉంటే వారు చాలా గొప్ప వ్యక్తులుగా గుర్తింపుపొందుతారు. అటువంటి సంఖ్యల ప్రత్యేకత వాటి విలువను కూడా పెంచుతుంది.

డిజైన్ మరియు చిత్రం : కొన్ని 5 రూపాయల నోట్లలో ట్రాక్టర్‌పై ఒక రైతు బొమ్మ ఉంటుంది. ఇది కూడా చాలా అరుదు. ఇలాంటి వాటిని సేకరించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా ఒక రూపాయి నోటు స్థితి దాని విలువను నిర్ణయిస్తుంది. అంటే చినిగిపోకుండా, ఎక్కువగా ఉపయోగించని రూపాయల నోట్లు కూడా మార్కెట్ లో మంచి ధరకు అమ్ముడవుతాయి. 

ఇంటిని శుభ్రం చేసే సమయంలో అకస్మాత్తుగా కంటికి కనిపించే పాత పుస్తకం లేదా పిగ్గీ బ్యాంకులో ఇలాంటి పాత 5 రూపాయల నోట్లు మీకు దొరికే అవకాశం ఉంది. కొన్ని సెంటిమెంట్ గా, కొన్ని వారి క్లోజ్ పర్సన్స్ ఇచ్చిన తీపి గురుతులుగా భావించి పుస్తకాల్లో దాచుకుంటారు. ఇలాంటివి మీ దగ్గర ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. వాటిని ఎక్కడ అమ్మాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పాత కరెన్సీని అమ్మడం ఎలా?

మీ పాత కరెన్సీ నోట్లను అమ్మడానికి అనేక జాతీయ, అంతర్జాతీయ వేలం వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. eBay, CoinBazzar, ఇలాంటి నాణేల సేకరణ వెబ్‌సైట్‌లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వాటిని అమ్ముకోవచ్చు. 

విలువను నిర్ణయించడం : మీ వద్ద ఉన్న నోట్లను అమ్మే ముందు, దాని విలువను గుర్తించండి. అంటే మీ దగ్గర ఉన్న రూపాయి నోటు అరుదైనదో కాదో చెక్ చేయండి. చిరగకుండా, నీట్ గా ఉంటే దానికి మరింత డిమాండ్ ఉంటుందని గుర్తు పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో అంశాలు పరిగణించి చివరికి ఆ నోటు ధరను మీరే నిర్ణయించవచ్చు. 

లీగల్ గానే అమ్మొచ్చు : ముందుగా మీరు మీ దగ్గర ఉన్న 5 రూపాయల నోట్ల వివరాలు, వాటి హై క్వాలిటీ ఫోటోలను అప్‌లోడ్ చేయండి. ఈ విధంగా నాణేలను అమ్మడం చట్టబద్ధమే. అయినప్పటికీ మీరు అమ్మే ప్లాట్‌ఫామ్ నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవండి. రూపాయి నోటు నాణ్యత ఎంత బాగుంటే దాని విలువ అంత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చిరిగిన, ఎక్కువగా మడతపెట్టిన కాగితాలను ఎవరూ కొనడానికి ముందుకు రారు.

click me!