రూ.91 రీచార్జ్ ప్లాన్ :
రీచార్జ్ ప్లాన్స్ ధరలు పెంచిన తర్వాత కూడా జియోలో వంద రూపాయల లోపు ప్లాన్ వుందంటే నమ్మలేము. కానీ అలాంటి ఓ ప్లాన్ ను జియో కలిగివుంది. వినియోగదారులు కేవలం 91 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఏకంగా 28 రోజుల వ్యాటిడిటితో జియో సేవలు పొందవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు 3 జిబి డాటా లభిస్తుంది. అలాగే 50 ఎస్ఎంఎస్ లను ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు జియో యాప్ సేవలను పొందవచ్చు.
అయితే ఈ రీచార్జ్ ప్లాస్ జియో ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ పెద్దగా అవసరం లేకుండా కేవలం వాయిస్ కాల్స్ కోసం అయితే ఈ ప్లాన్ తో రీచార్జ్ ఉత్తమం. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఈ రీచార్జ్ ప్లాన్ వర్తించదు.