బీరు బాటిల్లే మీ పెట్టుబడి.. నెలకు రూ.50 వేలు గ్యారెంటీ

First Published | Sep 18, 2024, 8:37 PM IST

ఇప్పుడు మీరు తెలుసుకునే బిజినెస్ ను మీ ఊర్లో ఉండి చేయొచ్చు. దీనికి కావాల్సింది ఒక్కటే. సొంతంగా వ్యాపారం చేయాలన్న తపన. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం వచ్చే ఈ గ్లాస్ క్రషింగ్ బిజినెస్ కు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 

చదువులు, ఉద్యోగాల కోసం సొంత ఊరు వదిలి ఎక్కడెక్కడికో వెళుతుంటాం. చదువు పూర్తయినప్పటికీ జాబ్ చేయాలి కాబట్టి సిటీలోనే ఉండాలి. ఎవరైతే సొంత ఊరిలోనే ఉంటూ డబ్బు సంపాదించాలనుకుంటారో అలాంటి వారికి ఈ గ్లాస్ క్రషింగ్ బిజినెస్ మంచి ప్రాఫిట్స్ ఇస్తాయి. 
 

ముందుగా మీరు మీ ఊరిలోనే చిన్న షెడ్ లేదా రూమ్ ను అద్దెకు తీసుకోండి. అందులో గ్లాస్ క్రషింగ్ మిషన్ ఏర్పాటు చేసుకోండి. తర్వాత బీరు బాటిల్స్, ఇతర గాజు సీసాలు కలెక్ట్ చేసి క్రషింగ్ చేయడమే. ఇలా చేయడం ద్వారా గ్లాస్ బుల్లెట్స్, గ్లాస్ సాండ్ అనే రెండు రకాల ప్రోడక్ట్స్ మీరు తయారు చేస్తారు.  వీటిని భారీ గ్లాస్ ఫ్యాక్టరీలు తీసుకుంటాయి. మీరు ముందుగానే వారితో డీలింగ్ మాట్లాడుకొని ఈ బిజినెస్ చేస్తే మంచి ప్రాఫిట్స్ పొందుతారు. 
 

Latest Videos


ఈ బిజినెస్ కి రా మెటీరియల్ వచ్చి తాగి పడేసిన బీరు బాటిల్స్. వీటిని మీరు డంప్ యార్డ్ నుంచి కొనుగోలు చేయవచ్చు. లేదా బార్ అండ్ రెస్టారెంట్స్, వైన్ షాప్ నిర్వాహకులతో ముందుగానే మాట్లాడుకొని బాటిల్స్ కలెక్ట్ చేయవచ్చు. మీరు డంపింగ్ యార్డ్ నుంచి బీరు బాటిల్స్ తీసుకుంటే ఒక్కోటి సుమారు రూ.4, రూ.5 పడుతుంది. అదే వైన్ షాప్స్ నుంచి తీసుకుంటే ఒక్కోటి రూ.2, రూ.3 అవుతుంది. 

మార్కెట్ లో మీరు ఒకేసారి కనీసం 1000 బాటిల్స్ కొనాల్సి ఉంటుంది. ఒక్కో బాటిల్ రూ.3 అనుకుంటే మీరు పెట్టుబడిగా రూ.3 వేలు పెట్టాలి. క్రషింగ్ మిషన్ వచ్చి మార్కెట్ లో రూ.50 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు ధర పలుకుతుంది. కంపెనీలను బట్టి ఈ ధరలు ఉంటాయి. 

కలెక్ట్ చేసిన మందు సీసాలపై ముందుగా స్టిక్కర్స్ రిమూవ్ చేయాలి. అప్పుడు సీసా రంగును బట్టి వాటిని వేరు చేయాలి. వాటిని క్రషింగ్ మెషీన్ లో వేసి గ్లాస్ బుల్లెట్స్ కాని, గ్లాస్ సాండ్ గా గాని క్రషింగ్ చేయాలి. ఇలా వచ్చిన పొడిని 50 కిలోలు, 100 కిలోలుగా ప్యాకింగ్ చేసి మీరు డీలింగ్ మాట్లాడుకున్న వారికి పార్సిల్ చేయండి.  

ఒక టన్ను గ్లాస్ బుల్లెట్స్ మార్కెట్ లో రూ.8000 ధర పలుకుతోంది.  క్రషింగ్ మిషన్ ద్వారా మీరు రూ.3000 పెట్టుబడితో టన్ను గ్లాస్ పొడిని మీరు ప్రొడ్యూస్ చేయవచ్చు. అంటే రోజుకు రూ.5000 లాభం అన్నమాట. ఈ లెక్కన నెలకు రూ.1.50 లక్షలు మీరు సంపాదించొచ్చు. మీ కంపెనీలో వర్కర్ల జీతాలు, షెడ్ అద్దె, కరెంట్ బిల్లు, ఇలా ఇతర ఖర్చులు సుమారు రూ.80 నుంచి రూ.లక్ష తీసేస్తే మీకు కచ్చితంగా రూ.50 వేలు ఈజీగా మిగులుతాయి. 
 

ఇది జెన్యూన్ బిజినెస్ కాదేమో మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే భారీ స్థాయిలో గ్లాస్ ఫ్యాక్టరీలు నడిపే యజమానులు కేవలం క్రషింగ్ కోసం ఇలా చిన్న చిన్న వ్యాపారుల మీద ఎందుకు డిపెండ్ అవుతారు. అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. బీరు బాటిల్స్ సేకరించడం చాలా పెద్ద పని. దూర ప్రాంతాల నుంచి వాటిని కలెక్ట్ చేసి ఫ్యాక్టరీ ఉన్న చోటుకు తీసుకు రావడం వల్ల ఎక్కువగా మనీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 

ఇలా చేయడం కంటే స్థానికంగా గ్లాస్ క్రషింగ్ మెషీన్ల ద్వారా గ్లాస్ పొడి, సాండ్ ను తీసుకోగలిగితే వారికి శ్రమ తగ్గుతుంది. అందుకే చిన్న వ్యాపారులను ఎంకరేజ్ చేస్తూ క్రషింగ్ పొడిని తీసుకొనేందుకు పారిశ్రామికవేత్తలు కూడా ముందుంటారు. అందుకే ఈ బిజినెస్ మీరు మీ ఊరిలోనే పెట్టుకొని హాయిగా నిర్వహించవచ్చు. 

click me!