NPS Scheme: ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి.? ఏ డాక్యుమెంట్స్ కావాలి

Published : Dec 17, 2025, 05:40 PM IST

NPS Scheme: నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్‌లో పెట్టుబ‌డి పెడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత ఆదాయ భ‌ద్ర‌త ల‌భించ‌డం ఈ ప‌థ‌కం ప్ర‌త్యేక‌త అని తెలిసిందే. ఈ ప‌థ‌కానికి సంబంధించిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
NPSపై ప్రభుత్వం కీలక మార్పు

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెట్టేవారికి ప్రభుత్వం కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. PFRDA తాజాగా ఎగ్జిట్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకు రిటైర్మెంట్ సమయంలో తప్పనిసరిగా 40 శాతం మొత్తాన్ని అన్యుటీకి వినియోగించాల్సి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనను తగ్గించి 20 శాతంగా మార్చారు. దీంతో పెట్టుబడిదారులు 80 శాతం మొత్తాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం కలుగుతుంది. అయితే కనీసం 15 సంవత్సరాలు NPSలో పెట్టుబడి చేసినవారికి ఈ సదుపాయం వర్తిస్తుంది.

25
NPS అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు.?

NPS పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు. అసంఘటిత రంగంలో పనిచేసే వారు (షాపు యజమానులు, డాక్టర్లు, లాయర్లు, ఫ్రీలాన్సర్లు) 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ భారతీయ పౌరుడైనా NPS ఖాతా తెరవచ్చు. ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

35
NPS అకౌంట్ తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్లు

NPS అకౌంట్ ఓపెన్ చేయాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం.

ఆధార్ కార్డు

పాన్ కార్డు

చిరునామా ధ్రువీకరణ పత్రం

యాక్టివ్ బ్యాంక్ ఖాతా

మొబైల్ నంబర్

ఈమెయిల్ ఐడీ

ఈ వివరాల ఆధారంగానే KYC ప్రక్రియ పూర్తవుతుంది.

45
ఆన్‌లైన్‌లో NPS అకౌంట్ ఎలా తెరవాలి?

NPS అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో చాలా సులభంగా తెరవొచ్చు. ప్రభుత్వం అనుమతించిన Central Recordkeeping Agency (CRA) వెబ్‌సైట్‌కి వెళ్లాలి. మొబైల్ నంబర్, పాన్ నంబర్, ఈమెయిల్ ఐడీ నమోదు చేయాలి. మొబైల్‌కి వచ్చిన OTP ఎంటర్ చేయాలి. ప్రక్రియ పూర్తయిన వెంటనే PRAN (Permanent Retirement Account Number) లభిస్తుంది. ఆ తర్వాత నుంచే పెట్టుబడులు ప్రారంభించవచ్చు

55
ఆఫ్‌లైన్ విధానం, NPS ప్రత్యేకతలు

ఆన్‌లైన్ సౌకర్యం లేనివారు ఆఫ్‌లైన్‌లో కూడా ఖాతా తెరవచ్చు. ఇందుకోసం దగ్గరలోని Point of Presence (PoP)కి వెళ్లాలి. ఇవి బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు. KYC పూర్తి చేసి కనీసం రూ. 500 జమ చేయాలి. తరువాత PRAN నంబర్ లభిస్తుంది. NPS అకౌంట్ పూర్తిగా పోర్టబుల్. అంటే ఉద్యోగం మారినా, నగరం మారినా, బిజినెస్ మొదలుపెట్టినా అకౌంట్ అదే కొనసాగుతుంది. అందుకే దీర్ఘకాలిక రిటైర్మెంట్ ప్లానింగ్‌కు ఇది నమ్మకమైన స్కీమ్‌గా భావిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories