Jio Plans : రిలయన్స్ జియో వినియోగదారులకు సూపర్ ఆఫర్. ఏకంగా 35,100 రూపాయలు విలువైన సేవలను న్యూ ఇయర్ గిప్ట్ గా అందిస్తోంది. ఆ సేవలేంటి? కొత్త రీచార్జ్ ప్లాన్స్ ఏంటి? తెలుసుకుందాం.
Jio Recharge Plans : భారతీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారులకు న్యూ ఇయర్ ఆఫర్లు ప్రకటించింది. 'హ్యాపీ న్యూ ఇయర్ 2026 పేరుతో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఎక్కువ డేటా, ఓటీటీ, కొత్త AI టెక్నాలజీలను ఇష్టపడే వారి కోసం ఈ ప్లాన్స్ రూపొందించారు. అపరిమిత 5G డేటా, ప్రముఖ స్ట్రీమింగ్ సేవలు, గూగుల్ జెమినీ ప్రో లాంటి ప్రీమియం AI ఫీచర్లు దీనిలో ప్రధాన ఆకర్షణలు.
25
జియో హీరో రీచార్జ్ ప్లాన్
న్యూ ఇయర్ ఆఫర్స్ లో ముఖ్యంగా రూ.3,599 వార్షిక 'హీరో రీఛార్జ్' ప్లాన్ ఆకట్టుకుంటోంది. 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 GB హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమిత 5G డేటా లభిస్తాయి. అలాగే 18 నెలలపాటు గూగుల్ జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితం... రూ.35,100 విలువైన జెమిని ప్రో యాక్సెస్ ను జియో ఉచితంగా అందిస్తుంది.
35
జియో సూపర్ సెలబ్రేషన్స్ మంత్లీ ప్లాన్
ఏడాది రీచార్జ్ కాకుండా నెలనెలా రీచార్జ్ చేసుకునేవారికి కూడా మరో సూపర్ ప్లాన్ తీసుకువచ్చింది జియో. కేవలం రూ.500 తో 'సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్' తీసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMS, యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు కూడా లభిస్తాయి.
ఇక రూ.103 'ఫ్లెక్సీ ప్యాక్'తో 5 GB డేటాతో పాటు, యూజర్లకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీని ఎంచుకునే సౌకర్యం ఉంది. 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సోనీ లివ్, జీ5, జియో హాట్ స్టార్, సన్ నెక్స్ట్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.
55
జియో కస్టమర్స్ కి న్యూ ఇయర్ గిప్ట్
మొత్తంగా జియో కొత్త సంవత్సర రీఛార్జ్ ప్లాన్‌లు డిజిటల్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి... కస్టమర్లకు అదనపు విలువను అందిస్తున్నాయి. అపరిమిత 5G, ఓటీటీ, గూగుల్ జెమినీ ప్రో లాంటి సేవల రూపంలో వినియోగదారులకు కొత్త సంవత్సరానికి ముందే బహుమతి ఇస్తోంది జియో.