గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు మరింత ఈజీగా ఎల్‌పి‌జి బుకింగ్..

First Published Apr 19, 2021, 3:32 PM IST

దేశంలోని ప్రభుత్వ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్) సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఇప్పుడు మీరు అడ్రస్ ప్రూఫ్ లేకుండా కూడా ఎల్‌పి‌జి సిలిండర్ పొందవచ్చు . ఇంతకుముందు అడ్రస్ ప్రూఫ్ లేని వ్యక్తులకు ఎల్‌పిజి సిలిండర్ లభించేది కాదు. తాజాగా ఐఓసిఎల్ సామాన్య ప్రజలకు ఉపశమనం ఇస్తూ ఎల్‌పి‌జి పై అడ్రస్ ప్రూఫ్ నియమం తొలగించింది.
 

ప్రధాన్ మంత్రి ఉజ్జ్వాల యోజన పథకం కింద ప్రభుత్వం ప్రతి రెండేళ్లలో ఒకటి కోటికి పైగా ఎల్‌పిజి కనెక్షన్లను ఉచితంగా అందిస్తుంది. అంతే కాకుండా ప్రజలు వారి పరిసరాల్లోని మూడు డీలర్ల నుండి సిలిండర్ రీఫిల్ పొందే అవకాశాన్ని కూడా పొందుతారు. 'క్లీన్ ఫ్యూయల్, బెటర్ లైఫ్' అనే నినాదంతో, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో 1 మే 2016 న సాంఘిక సంక్షేమ పథకం - ప్రధానమంత్రి ఉజ్జ్వాల యోజనను ప్రారంభించారు.
undefined
ఎల్‌పిజి సిలిండర్‌ను బుక్ చేసుకోవడం ఎలా ?మీరు దేశంలోని ఏ మూల నుండి అయినా మిస్డ్ కాల్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు ఈ నంబర్ ప్రతి రాష్ట్రనికి మారుతుంటుంది. అలాగే మీరు వాట్సాప్ ద్వారా కూడా సిలిండర్లను కూడా బుక్ చేసుకోవచ్చు. రీఫిల్ అని టైప్ చేసి మీ రాష్ట్ర వాట్సాప్ టోల్ ఫ్రీ నంబర్‌కు మెసేజ్ పంపండి. దీంతో మీ సిలిండర్ బుక్ అవుతుంది.
undefined
ఎల్‌పి‌జి ధర ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ ఈ నెల ప్రారంభంలో వంటగ్యాస్ సిలిండరు ధరపై రూ.10 తగ్గించింది. అంటే ఆప్రిల్ 1 నుంచి ఒక ఎల్‌పిజి సిలిండర్ ధర ఢీల్లీలో రూ .809, కోల్‌కతాలో రూ .850, ముంబైలో రూ .809, చెన్నైలో రూ .825, హైదరాబాద్ లో రూ.830 ఉంది.
undefined
ధరల పెరుగుదలఫిబ్రవరి 2021లో ఎల్‌పిజి సిలిండర్ ధరను మూడు సార్లు పెరగడం గమనార్హం. ఫిబ్రవరి 4న ఎల్‌పిజి సిలిండర్‌ ధర పై రూ .25, తరువాత ఫిబ్రవరి 14న రూ .50, ఫిబ్రవరి 25న మరో రూ .25 పెంచారు.
undefined
undefined
click me!