ఊహించని విధంగా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. వాస్తవానికి బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. 2025 వరకు ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంటుందని మార్కెట్ నిపుణుల నివేదికలు చెబుతున్నాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మార్కెట్ పరిస్థితులను తారుమారు చేశాయి. ఇప్పటివరకు భారత మూలాలున్న కమలా హారిస్ గెలుస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ట్రంప్ గెలిచి అమెరికా పగ్గాలు అందుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పెరుగుతూ ఉండాల్సిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే గోల్డ్ రేట్లు తగ్గడం అసాధ్యమనే చెప్పాలి.
union bank of switzerland ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా దేశాల మధ్య రాజకీయ యుద్ధాలు బంగారం ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే రోజురోజుకు గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. 2025లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. 2024 చివరి నాటికి బంగారం ధరలు ఔన్సుకు సుమారు రూ.2.30 లక్షలకు పెరుగుతాయని అంచనా. వివిధ దేశాల కరెన్సీలో హెచ్చుతగ్గులు కూడా బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేయడానికి ఓ కారణం. ముందు జాగ్రత్తగా టర్కీ, సింగపూర్, బ్రెజిల్, భారతదేశం వంటి దేశాలు కూడా తమ నిల్వలను పెంచుకోవడంతో 2025 ప్రారంభంలో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ తగ్గుదల వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. తగ్గిన ధరల ప్రకారం 10 గ్రాముల బంగారం రూ.500 తగ్గి రూ.78,100కి పడిపోయింది. వెండి ధరలు కూడా రూ.94,261 నుంచి రూ.92,000లకు పడిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ మొదటి ప్రసంగం చేశారు. ఆ తర్వాత నుంచి గోల్డ్ ధరలు తగ్గడం ప్రారంభించాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి మరింత తగ్గితే బాగుండునని భావిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే బంగారం ధర పతనం శాశ్వతంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇలా జరగడానికి కొంత సమయం పడుతుంది.
ఢిల్లీలో 24k బంగారం ధర 10 గ్రాములకు రూ.1,790 తగ్గింది. ప్రస్తుతం రూ.78,710కి ధర ఉంది. 22k బంగారం ధరలు రూ.1,650 తగ్గాయి. 10 గ్రాములకు రూ.72,150కి బంగారం ధర ఉంది. గ్లోబల్ ఫ్రంట్‌లో, బంగారం ధరలు మూడు వారాల కంటే తక్కువ స్థాయికి పడిపోయాయి. ఔన్సుకు $2,657.65 వద్ద ఉంది. ఇది అక్టోబర్ మధ్య నుండి దాని కనిష్ట స్థాయిని తాకింది. బంగారం గత వారం ఔన్స్‌కు 2,790.15 డాలర్ల రికార్డు స్థాయిని తాకింది. అయితే ఆ తర్వాత ఔన్స్‌కు 130 డాలర్ల కంటే ఎక్కువ పడిపోయింది. US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.4% క్షీణతను చూసింది.