క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ ఇంత కఠినంగా ఉన్నాయేంటి? డిసెంబర్ 1 నుంచి అమలు

First Published | Nov 7, 2024, 4:41 PM IST

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ రూల్స్ మారబోతున్నాయి. రివార్డ్ పాయింట్స్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ లాంటి వాటిలో మార్పులు వస్తాయి. పాయింట్స్ వాడకం, లాంజ్ యాక్సెస్ పరిమితులు మారిపోయాయి. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

చాలా మంది ఎంప్లాయిస్ క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారు. ఎందుకంటే నెలకు ఒకసారి మాత్రమే పడే శాలరీని నెలమొత్తం ఖర్చు పెట్టాలంటే సరైన ప్లానింగ్ ఉండాలి. అయితే ఈ ప్లానింగ్ చాలా మందిలో తప్పుతుంది. దీనికి తోడు మధ్యలో వచ్చే ప్రయాణాలు, హాస్పిటల్ ఖర్చులు, పండగలు ఇలా అనేక కారణాలతో డబ్బులు అవసరమవుతుంటాయి. 

ఇలాంటి సమయంలో అప్పు ఇచ్చే వాళ్లు అనేక కండీషన్స్ పెడుతుంటారు. సమయానికి తీర్చకపోతే ఊరుకోరు. అదే క్రెడిట్ కార్డు అయితే బ్యాంకులే పిలిచి డబ్బులిస్తాయి. వడ్డీ కూడా బయట అప్పులిచ్చే వారికంటే తక్కువగానే ఉంటుంది. అందుకే ప్రతి ఎంప్లాయి కూడా క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. వీటితో ఎంత ఉపయోగమో దుర్వినియోగం చేస్తే కూడా అంత కష్టాలు తప్పవు.

ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. బ్యాంకులు కూడా ఈజీగా క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. అయితే కార్డు మీద జరిగే లావాదేవీలను బట్టి గిఫ్ట్ వోచర్లు, ఇతర బెనిఫిట్స్ ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి క్రెడిట్ కార్డ్ రూల్స్ మారబోతున్నాయి.

మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే మీకోసం ముఖ్యమైన అప్‌డేట్ ఇక్కడ ఉంది. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ రూల్స్ మారబోతున్నాయి. కార్డ్ బెనిఫిట్స్‌ను ప్రభావితం చేసే రెండు ముఖ్యమైన మార్పుల్ని బ్యాంకులు తీసుకొస్తున్నాయి. ఈ అప్‌డేట్స్‌లో రివార్డ్ పాయింట్స్, వాటిని పొందడం, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ గురించి మార్పులు ఉన్నాయి.


డిసెంబర్ 1 నుంచి ఫ్లైట్స్, హోటల్స్ బుకింగ్‌లకు రివార్డ్ పాయింట్స్ ఎన్ని వాడాలి అనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. మొత్తం ఖర్చులో 70% లేదా నెలవారీ గరిష్ట పరిమితి (ఏది తక్కువైతే అది) వరకు కార్డ్ హోల్డర్స్ తమ రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. దీని ప్రకారం ప్రైమ్ కార్డులకు 6 లక్షల పాయింట్స్, మార్క్యూ కార్డుకు 3 వేల పాయింట్స్, రిజర్వ్ కార్డుకు 2 వేల పాయింట్స్, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1 లక్ష పాయింట్స్ అని తెలిసింది.

గిఫ్ట్ వోచర్లు లేదా స్టేట్‌మెంట్ క్రెడిట్స్‌కు అందుబాటులో ఉన్న పాయింట్స్‌లో 50% మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు అనే ప్రస్తుత పరిమితితో పాటు ఈ కొత్త పరిమితి కూడా వర్తిస్తుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి యెస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డులపై ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం ఖర్చు పరిమితుల్ని పెంచుతోంది.

కొత్త రూల్స్ ప్రకారం యెస్ మార్క్యూ కార్డుకు ఆరు లాంజ్ విజిట్స్, యెస్ రిజర్వ్ కార్డుకు మూడు విజిట్స్ (రూ.1 లక్ష ఖర్చుతో) యెస్ ఫస్ట్ బిజినెస్ కార్డుకు రెండు విజిట్స్ (రూ.75,000 ఖర్చుతో) ఉంటాయి. యెస్ ఎలైట్+, సెలెక్ట్, BYOC, వెల్‌నెస్ ప్లస్, యెస్ ప్రాస్పెరిటీ బిజినెస్ కార్డులకు, కార్డ్ హోల్డర్స్ ఒకటి లేదా రెండు లాంజ్ విజిట్స్ పొందాలంటే రూ.50,000 ఖర్చు చేయాలి.

Latest Videos

click me!