తరచుగా UPI ద్వారా బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా? అలాంటి సేవలకు పరిమితులు విధించనున్నారు. ఆగస్టు 1 నుంచి కొత్త UPI నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఈ కొత్త నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.
ఆగస్టు 1 నుంచి UPI లావాదేవీలపై కొన్ని పరిమితులు అమలు చేయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. UPI నెట్‌వర్క్‌లో తరచుగా ఉపయోగించే 10 ముఖ్యమైన ఫీచర్ల వినియోగాన్ని నియంత్రించాలని బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలకు NPCI సూచించింది. ఇంతకీ ఆ మార్పులు ఏంటంటే.
26
బ్యాలెన్స్ ఎంక్వైరీకి పరిమితి:
ఒక యాప్‌లో ఒక వినియోగదారుడు 24 గంటల్లో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు Paytm, PhonePe రెండూ వాడితే, ప్రతి యాప్‌లో 24 గంటల్లో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చూడొచ్చు. తరచుగా బ్యాలెన్స్ చెక్ చేసుకునే వారికి ఇది ఇబ్బంది కలిగించవచ్చు. రద్దీ సమయాల్లో బ్యాలెన్స్ ఎంక్వైరీలను పరిమితం చేయాలని లేదా నిలిపివేయాలని UPI యాప్‌లకు సూచించారు. ప్రతి లావాదేవీ తర్వాత వినియోగదారుడి అకౌంట్ బ్యాలెన్స్‌ను నోటిఫికేషన్ ద్వారా తెలియజేయాలని కూడా సూచించారు.
36
ఆటోపే మాండేట్‌లకు సమయ పరిమితి:
UPI ఆటోపే మాండేట్‌లు (SIP, Netflix సబ్‌స్క్రిప్షన్ వంటివి) రద్దీ లేని సమయాల్లో మాత్రమే పనిచేస్తాయి. ఒక మాండేట్‌కు గరిష్టంగా 3 రీట్రైలతో ఒకే ప్రయత్నం మాత్రమే అనుమతిస్తారు. రద్దీ సమయాల్లో కూడా ఆటోపే మాండేట్‌లను క్రియేట్ చేయవచ్చు. కానీ అవి రద్దీ లేని సమయాల్లో మాత్రమే అమలులోకి వస్తాయి.
ట్రాన్సాక్షన్ స్టేటస్‌ను చెక్ చేయడానికి కూడా పరిమితులు ఉంటాయి. లావాదేవీ పూర్తయిన 90 సెకన్ల తర్వాత మాత్రమే మొదటిసారి చెక్ చేయాలి. రెండు గంటల్లో గరిష్టంగా మూడు సార్లు మాత్రమే చెక్ చేయవచ్చు. ఏదైనా లోపం ఏర్పడితే, ఆ లావాదేవీ విఫలమైనట్లుగా భావించి, మళ్ళీ మళ్ళీ చెక్ చేయడం ఉండదు.
56
అకౌంట్ జాబితా పొందడానికి పరిమితి:
UPIలో ఒక వినియోగదారుడి మొబైల్ నంబర్‌తో లింక్ చేసిన అన్ని బ్యాంక్ ఖాతాలను చూడటానికి 'అకౌంట్ లిస్ట్ రిక్వెస్ట్' అనే సేవ ఉంది. ఒకే ప్లాట్‌ఫారమ్‌లో వివిధ బ్యాంక్ ఖాతాలను నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది. కొత్త నిబంధనల ప్రకారం, ఒక వినియోగదారుడు 24 గంటల్లో ఒక UPI యాప్‌లో గరిష్టంగా 25 సార్లు మాత్రమే ఈ రిక్వెస్ట్ చేయొచ్చు.
66
ఈ పరిమితులు ఎందుకు?
సిస్టమ్ ఓవర్‌లోడ్‌ను నివారించడానికి, UPI మౌలిక సదుపాయాలను స్థిరంగా ఉంచడానికి ఈ పరిమితులు అవసరమని NPCI తెలిపింది. గతంలో సిస్టమ్ ఓవర్‌లోడ్ కారణంగా UPI సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ మార్పులు చేస్తున్నారు.