Financial planning: రూ. 30 వేల జీత‌మైనాస‌రే... ఇలా ప్లాన్ చేసుకున్నారంటే బిందాస్‌గా ఉండొచ్చు.

Published : May 26, 2025, 04:24 PM IST

డ‌బ్బులు సంపాదించ‌డం ఎంత ముఖ్య‌మో దానిని స‌రిగ్గా ప్లానింగ్ చేసుకోవ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని ఆర్థిక రంగ నిపుణులు చెబుతుంటారు. వ‌చ్చేది త‌క్కువ జీత‌మైనా స‌రే స‌రిగ్గా కేటాయింపులు చేసుకుంటే ఫ్యూచ‌ర్ బిందాస్‌గా ఉంటుంది. 

PREV
15
రూ. 30 వేలు జీతం వ‌స్తే

ఉదాహ‌ర‌ణ‌కు మీకు నెల‌కు రూ. 30 వేలు జీతం వ‌స్తుంద‌ని అనుకుందాం. ఆ మొత్తాన్ని ఎలా ప్లానింగ్ చేసుకోవాలి? ఏయే అవ‌స‌రాల‌కు ఎంత కేటాయించాలి.? ఇప్పుడు చూద్దాం. మీకు వ‌చ్చిన మొత్తం జీతంలో 50 వాతం మీ అవ‌స‌రాల‌కు కేటాయించాలి. 20 శాతం మీ కోరిక‌లు, మ‌రో 30 శాతం పెట్టుబ‌డికి కేటాయించాలి.

25
అవ‌స‌రాల‌కు 50 శాతం కేటాయించాలి:

మీకు వ‌చ్చే మొత్తం జీతంలో 50 శాతం మీ అవ‌స‌రాల‌కు కేటాయించాలి. వీటిలో..

* ఇంటి అద్దెకు రూ. 7000

* ఫుడ్ అండ్ గ్రాస‌రీ కోసం రూ. 3500

* ఎల‌క్ట్రిసిటీ, వైఫై, ఫోన్ రీఛార్జ్ వంటి వాటికి రూ. 2000

* క్లాతింగ్ వంటి అవ‌స‌రాల‌కు రూ. 1000

* ఆఫీస్ ట్రావెలింగ్‌కు రూ. 1500

35
కోరిక‌ల‌కు 20 శాతం కేటాయించాలి:

మీకు వ‌చ్చే రూ. 30 వేల‌లో 20 శాతం అంటే రూ. 6000 మీ కోరిక‌ల కోసం కేటాయించాలి. ఈ జాబితాలో..

* బైక్‌/ఫోన్‌/ఇంట్లో నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల వంటి కొనుగోలు చేస్తే వాటి ఈఎమ్ఐల‌కు రూ. 3 వేలు కేటాయించుకోండి.

* వెకేష‌న్ కోసం రూ. 2 వేలు ప‌క్క‌న పెట్టుకోండి.

* అప్పుడ‌ప్పుడు హోట‌ల్ లేదా పార్టీల‌కు రూ. 1000 కేటాయించండి.

45
పెట్టుబ‌డి కోసం:

ఇక పెట్టుబ‌డి విష‌యానికొస్తే మీకు వ‌చ్చే మొత్తం జీతంలో 30 శాతం అంటే రూ. 9000 కేటాయించుకోండి. పెట్టుబ‌డి కూడా మొత్తం ఒకే చోట కాకుండా ప‌లు రంగాల్లో ఇన్వెస్ట్ చేయండి.

* ఎమ‌ర్జెన్సీ ఫండ్ కోసం రూ. 2500

* హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రూ. 1000

* ట‌ర్మ్ ఇన్సూరెన్స్ కోసం రూ. 1000

* మీ చిన్నారుల చ‌దువు కోసం రూ. 1500 (ఏడాదికి రూ. 20 వేల లోపు ఫీజున్న స్కూళ్లకు, అది కూడా ఒక్క సంతానం ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది) 

* మ్యుచువ‌ల్ ఫండ్స్ కోసం రూ. 3000

55
మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మూడు భాగాలు.

మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టేపెట్టుబ‌డిని కూడా మూడు భాగాలుగా విభ‌జించాలి. ఇందులో లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్‌లో 50 శాతం, స్మాల్ క్యాప్‌లో 25 శాతం, మ‌ల్టీ అసెట్‌లో 25 శాతం కేటాయించాలి. ఇలా మీకు వ‌చ్చే జీతం త‌క్కువైనా స‌రే స‌రిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆర్థిక క‌ష్టాలు రాకుండా ఉండొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories