బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్: ఇకపై జెట్ స్పీడ్‌తో 4జీ సేవలు: 93,450 టవర్ల ఏర్పాటు పూర్తి

Published : May 27, 2025, 01:27 PM IST

ఇకపై దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ సేవలు జెట్ స్పీడ్ తో అందనున్నాయి. యుద్ధ ప్రాతిపదికన బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 93,450 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. దీంతో స్వదేశీ 4జీ టెక్నాలజీని కలిగి ఉన్న ఐదవ దేశంగా భారతదేశం నిలిచింది. 

PREV
15
లక్ష 4జీ టవర్ల లక్ష్యం

దేశీయ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4జీ సేవలను విస్తరిస్తోంది. లక్ష 4జీ టవర్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీఎస్ఎన్ఎల్ ఇప్పటివరకు 93,450 టవర్లను ఏర్పాటు చేసిందని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. స్వదేశీ 4జీ టెక్నాలజీతో ఈ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు.

25
93,450 4జీ టవర్ల ఏర్పాటు

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ప్రారంభోత్సవంలో కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 93,450 4జీ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు. 

22 నెలల్లో దేశంలోనే తొలి స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. సి-డీఓటీ, బీఎస్ఎన్ఎల్, తేజస్ నెట్‌వర్క్స్, టీసీఎస్ కలిసి బీఎస్ఎన్ఎల్ కోసం ఈ 4జీ టవర్లను ఏర్పాటు చేశాయి. 

35
4జీ టెక్నాలజీ కలిగిన 5వ దేశం ఇండియా

స్వదేశీ 4జీ టెక్నాలజీని కలిగి ఉన్న ఐదవ దేశంగా భారతదేశం అవతరించింది. చైనా (హువాయ్), ఫిన్లాండ్ (నోకియా), స్వీడన్ (ఎరిక్సన్), దక్షిణ కొరియా (శామ్‌సంగ్) స్వదేశీ 4జీ టెక్నాలజీని అభివృద్ధి చేసిన మిగతా నాలుగు దేశాలు. 

45
రూ.2,903 కోట్లు ఇచ్చిన కేంద్రం

18,685 ప్రాంతాల్లో 4G మొబైల్ నెట్‌వర్క్ ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.2,903 కోట్ల విలువైన అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్ ను బీఎస్ఎన్ఎల్ ఇటీవల టీసీఎస్‌కి ఇచ్చింది. 2023లో టీసీఎస్ దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్ విస్తరణ కోసం బీఎస్ఎన్ఎల్ నుండి రూ.15,000 కోట్లకు పైగా విలువైన అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్ ను పొందింది. అందులో భాగంగానే  ప్రస్తుతం ఈ ఒప్పందం జరిగింది.

55
లక్ష 4జీ టవర్ల లక్ష్యం

టీసీఎస్ పర్యవేక్షణలో సీ-డీవోటీ, టీసీఎస్ అనుబంధ సంస్థ తేజస్ నెట్‌వర్క్స్ బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వర్క్ ను విస్తరించాయి. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కోసం లక్ష 4జీ టవర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. మరి కొన్ని నెలల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని బీఎస్ఎన్ఎల్ ధీమా వ్యక్తం చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories