ఫిబ్రవరి 1 నుంచి G Pay, Phone Peల్లో UPI ట్రాన్సాక్షన్స్ పనిచేయవు. ఎందుకంటే..

Published : Jan 30, 2025, 02:10 PM IST

మీరు G Pay, Phone Pe ఉపయోగించి పేమెంట్స్ చేస్తుంటారా?  ఫిబ్రవరి 1 నుంచి కొందరి UPI ట్రాన్సాక్షన్స్ బ్లాక్ అవుతున్నాయి. UPIకి సంబంధించిన కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. మరి ఎవరి UPI ఐడీల ట్రాన్సాక్షన్స్ పనిచేయవో ఇక్కడ తెలుసుకోండి. NPCI విధించిన కొత్త రూల్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీ UPI ఐడీ రూల్స్ ప్రకారం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 

PREV
14
ఫిబ్రవరి 1 నుంచి G Pay, Phone Peల్లో UPI ట్రాన్సాక్షన్స్ పనిచేయవు. ఎందుకంటే..

UPI అనేది ఇప్పుడు భారతదేశం సహా అనేక దేశాలలో ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగించే మాధ్యమం. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా UPI లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. కనీసం టీ తాగిన వారు కూడా UPI ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. అంతలా డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. అందుకే ప్రభుత్వం కస్టమర్ల ప్రయోజనాలను కాపాడటం కోసం అనేక చర్యలు తీసుకుంది. వాటిల్లో భాగంగా మరోసారి UPIకి సంబంధించిన నిబంధనల్లో పెద్ద మార్పు తీసుకొచ్చింది.

24

కొన్ని UPI లావాదేవీలను తిరస్కరించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అంటే ప్రత్యేక అక్షరాలు ఉన్న UPI ఐడీలతో ఆర్థిక లావాదేవీలను NPCI నిలిపివేస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రకటనను కూడా జారీ చేసింది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తాయి.

34

నిబంధనల ప్రకారం ఆల్ఫాన్యూమెరిక్ అక్షరాలు ఉపయోగించే ఐడీలు ఉన్న కస్టమర్లు మాత్రమే ఇప్పుడు UPI ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించగలరు. అంటే వినియోగదారులు తమ UPI ఐడీల్లో A-Z, a-z మధ్య అక్షరాలతో పాటు 0-9 మధ్య సంఖ్యలను ఉపయోగించి ఐడీలను కలిగి ఉండాలి. @, #, % మరియు $ వంటి ప్రత్యేక అక్షరాలు ఉన్న ఐడీలతో ఇకపై లావాదేవీలు చేయడానికి వీలు కాదు. ఈ నిబంధనలను పాటించని ఐడీలను ఫిబ్రవరి 1 నుంచి NPCI బ్లాక్ చేస్తుంది. 

44

NPCI ఎందుకు ఈ చర్య తీసుకుంది?

UPI లావాదేవీలను పెంచడానికి NPCI ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అన్ని బ్యాంకులకు ఇప్పటికే  కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి ముందు UPI ఐడీల కోసం ఆల్ఫాన్యూమెరిక్ అక్షరాలను ఉపయోగించాలని NPCI సూచనలు ఇచ్చింది. అయితే కొన్ని బ్యాంకులు, యాప్‌లు నిబంధనలను పాటించలేదు. అందువల్ల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంది.

click me!

Recommended Stories