సస్పెన్షన్, బ్రేకింగ్
AE-8 స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, రియర్ స్ప్రింగ్-లోడెడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంది. అందువల్ల ఇది సౌకర్యవంతమైన రైడ్‌ను అందిస్తుంది. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు అమర్చారు. స్కూటర్‌లో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉండటం వల్ల సురక్షితమైన ప్రయాణాన్ని మీరు ఆస్వాధించవచ్చు.
ధర, లభ్యత
హీరో ఎలక్ట్రిక్ AE-8 ఎక్స్-షోరూమ్ ధర రూ.69,999. ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా ఉన్న హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో లభిస్తుంది. ఈ స్కూటర్‌పై కంపెనీ 3 సంవత్సరాల వారంటీని కూడా ఉంది.