అసలు వాస్తవం ఏమిటో చూద్దాం..
1. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రత్యక్షంగా జరిగే కారు క్రయవిక్రయాలకు జీఎస్టీ మినహాయింపు ఉంటుంది.
2. సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే డీలర్లు మాత్రమే 18శాతం జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మొత్తం రీసేల్ అమౌంట్‌పై కాదు, మార్జిన్ విలువపై మాత్రమే. అంటే డీలర్ కారును కొనుగోలు చేసిన ధర, రీసేల్ చేసిన ధర మధ్య మార్జిన్ విలువ మీద మాత్రమే ఈ 18 శాతం జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్ రూ. 8 లక్షలకు ఒక విద్యుత్ కారును కొనుగోలు చేసి, అదే కారును రూ. 9 లక్షలకు ఇతరులకు విక్రయిస్తే, లాభం మార్జిన్ ఆయిన రూ. 1 లక్ష మీద 18 శాతం జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
సెకండ్ హ్యాండ్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా అన్ని మోటారు వాహనాల మీద విధించే పన్ను విధానం ఏకరీతిగా మార్చాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీఎస్టీ
కౌన్సిల్ అధికారిక ప్రకటనతో ఈ వివరణ ఇచ్చింది కానీ ఈ నిర్ణయం సెకండ్-హ్యాండ్ కార్ల మార్కెట్‌ను భయాందోళనకు గురిచేసిందనేది వాస్తవం. పెరిగిన పన్ను భారం అంతిమంగా వినియోగదారులు భరించాల్సి రావడం వల్ల సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు తగ్గుతాయనే ఆందోళన మొదలైంది.