Infosys Shares: ప్రతి తాతయ్య తన మనవడు, మనవరాలికి ప్రేమతో చాక్లెట్లు, బిస్కెట్లు కొని పెడుతుంటారు. పుట్టినరోజులాంటి ప్రత్యేక సందర్భాల్లో చిన్నచిన్న కానునకలిస్తుంటారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన మనవడు ఏకాగ్రకి అలాగే కొన్ని షేర్లు బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు వాటి విలువ అక్షరాలా 213 కోట్లు. తాజాగా ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటించిన డివిడెండ్ రూపంలోనే రూ.10 కోట్లు అందుకోనున్నాడు.
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మార్చి 31, 2025 నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరానికి, కంపెనీ వాటాదారులకు షేరుకు రూ.22 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీని రికార్డ్ తేదీ మే 30 గా నిర్ణయించారు. ఒక నెలలోపు అంటే జూన్ 30 లోపు డివిడెండ్ మొత్తం చెల్లిస్తామని కంపెనీ తెలిపింది.
24
నారాయణ మూర్తి మనవడు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమారుడు రోహన్, కోడలు అపర్ణ కృష్ణన్ కుమారుడే ఏకాగ్ర. 2023 లో బెంగళూరులో జన్మించాడు. మనవడు పుట్టిన సంతోషంలో నారాయణ మూర్తి తన 15 లక్షల షేర్లను అతడికి కానుకగా ఇచ్చాడు. వీటి నుంచి ఏకాగ్ర కేవలం డివిడెండ్ రూపంలోనే దాదాపు రూ.3.30 కోట్లు అందుకుంటాడు. తాతయ్య తన మనవడు ఏకాగ్రకు షేర్లను బహుమతిగా ఇచ్చినప్పుడు, షేరుకు రూ.49 చొప్పున మూడు డివిడెండ్ అందుకున్నాడు. మొత్తంగా అతడు కేవలం డివిడెండ్ రూపంలోనే రూ.10కోట్ల రూపాయల లబ్ది పొందాడు.
34
ఏకాగ్ర షేర్ల విలువ
17 నెలల ఏకాగ్రకు రూ.223 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. ఏప్రిల్ 18 నాటికి ఇన్ఫోసిస్, ఒక్కో షేరు ధర రూ.1420. అంటే, ఏకాగ్ర వద్ద ఉన్న షేర్ల మొత్తం మార్కెట్ విలువ రూ.213 కోట్లు. దీనికి రూ.10 కోట్ల డివిడెండ్ కలిపితే, ఏకాగ్ర వద్ద రూ.223 కోట్లు ఉంటాయి.
44
సుధా మూర్తి డివిడెండ్ రూ.76 కోట్లు
నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి కూడా డివిడెండ్ ద్వారారూ.76 కోట్లు అందుకుంటారు. నారాయణ మూర్తి కుమార్తె అక్షత మూర్తి, అల్లుడు రిషి సునాక్‌లకు ఇద్దరు కుమార్తెలు, కృష్ణ, అనుష్క. నారాయణ మూర్తి కుమార్తె అక్షత వద్ద ఇన్ఫోసిస్‌లో దాదాపు 3.89 లక్షల షేర్లు ఉన్నాయి. ఆమె ఇప్పటికి డివిడెండ్ రూపంలో రూ.85.71 కోట్లు అందుకున్నారు.