Credit Card: ఒక‌టి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే.. లాభ‌మా? న‌ష్ట‌మా.?

Published : May 20, 2025, 03:01 PM IST

ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం సర్వ సాధారణమైంది. ఒకటికి మించి కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే ఒకటికి మంచి కార్డులు ఉపయోగిస్తే లాభమా.? నష్టమా.? ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
ఒకటికి మించి క్రెడిట్ కార్డులు

ఇప్పుడు క్రెడిట్ కార్డులు కామన్ గా మారాయి. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటున్నాయి. చేతిలో డబ్బులు లేనప్పుడు క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి.  అయితే క్రెడిట్ కార్డును తెలివిగా ఉపయోగించుకుంటే లాభాలు ఉన్నట్లే, తప్పులు చేస్తే నష్టాలు కూడా ఉంటాయి. క్రెడిట్ బిల్లును సమయానికి చెల్లించకపోతే వడ్డీ, జరిమానాలు కూడా ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ కార్డులు వాడటం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి చూద్దాం.

26
క్రెడిట్ రోల్ ఓవర్ అంటే ఏంటి.?

సాధారణంగా క్రెడిట్ కార్డును ఉపయోగించిన తర్వాత 45 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే ఒకటి కంటే ఎక్కువ కార్డులుంటే, ఈ కాలాన్ని పొడిగించుకోవచ్చు. ఒక కార్డు బిల్లును ఇంకో కార్డుతో కడితే, 45 రోజుల వరకు పొడిగించుకోవచ్చు. దీన్ని క్రెడిట్ రోల్‌ఓవర్ అంటారు.

36
ఇలా ఆదా చేసుకోవచ్చు.

వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే రకరకాల ఆఫర్లను పొందొచ్చు. ముఖ్యంగా రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, ఆఫర్లు వస్తాయి. డబ్బు ఆదా చేసుకోవచ్చు.

46
డిస్కౌంట్స్

కొన్ని కార్డులు దీర్ఘకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తాయి. సినిమా టిక్కెట్లు, హోటల్ బుకింగ్‌లపై మంచి డిస్కౌంట్లు. తరచూ ప్రయాణాలు, సినిమాలకు వెళ్లే వారికి ఈ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. 

56
ఛార్జీలు ఉంటాయి.

ఒకటి కంటే ఎక్కువ కార్డులుంటే వచ్చే నష్టాల్లో ఛార్జీలు ప్రధానమైనవి. ప్రతీ కార్డుకు ఇయర్లీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కార్డు ద్వారా జరిగే ప్రయోజనం కంటే చెల్లించే ఛార్జీలు ఎక్కువగా ఉంటే ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉండడం అంత మంచిది కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 

66
అప్పులు ఎక్కువయ్యే అవకాశం.

క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఉంటే కొన్ని సందర్భాల్లో ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంటుంది. మనకు తెలియకుండానే ఎక్కువ ఉపయోగిస్తాం. అదే విధంగా ఒకటి కంటే ఎక్కువ కార్డులుంటే, చెల్లింపు తేదీలు, క్రెడిట్ సైకిల్ గుర్తుంచుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. దీంతో బిల్లులు చెల్లించే విషయాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories