వేలంలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి

Published : May 20, 2025, 12:55 PM IST

ఈ కాలంలో కొత్త ఇల్లు కొనాలంటే పెద్ద మొత్తం పెట్టుబడి కావాలి. అందుకే వేలంలో కొంటే కాస్త డబ్బులు సేవ్ అవుతాయని కొంతమంది వేలంలో ఇల్లు కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉంటే ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి.

PREV
15
రికవరీ కోసమే ఇళ్ల వేలం..

ఆర్థిక ఇబ్బందుల వల్ల వేలంలో ఇల్లు కొనాలనుకోవడం తప్పులేదు. కానీ ఇందులో ఉండే లోటుపాట్లు తెలియకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాస్తవానికి ఇళ్లను ఎక్కువగా బ్యాంకులు వేలం వేస్తాయి. రికవరీ కోసమే ఇలా చేస్తాయి. అంటే ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ హోమ్ లోన్ తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఆ ఆస్తిని బ్యాంకు వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది.

25
ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..

ఇలాంటి ఇళ్ల ధరలు మార్కెట్‌ కంటే 10 % నుంచి 20 % తక్కువకే దొరుకుతాయి. కానీ ఇవి డైరెక్ట్‌గా కొనలేరు. ముందుగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు గాని వేలంలో ఇల్లు కొనాలనుకుంటే ముందు అడ్వాన్స్ డిపాజిట్ కట్టాలి. ఇది కడితేనే వేలం ప్రక్రియలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు. మీరు వేలంలో ఇల్లు దక్కించుకొనే ముందు ఆ ఇంటి డాక్యుమెంట్లు జాగ్రత్తగా పరిశీలించండి. అవన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి పాట పాడుకున్న తర్వాత లోపాలు బయటపడితే మీరే ఇబ్బందులు పడతారు.

35
ఇవన్నీ ముందే చెక్ చేయండి..

వేలంలో ఇల్లు కొనే ముందు సదరు ఆస్తికి సంబంధించి లీగల్ క్లియరెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి. టైటిల్ డీడ్, మున్సిపల్ అనుమతులు, పాత ఋణాలు ఉన్నాయా లేదా అన్నివి కూడా కచ్చితంగా చెక్ చేయాలి. కొన్ని వేలం ఇళ్లలో భూ వివాదాలు, కోర్టు కేసులు కూడా ఉండవచ్చు. అధికారులు ఇచ్చిన సమాచారంపై ఆధారపడి ఉండిపోకుండా మీ సొంతంగా ఎక్వైరీ చేసుకొని వేలం పాటలో పాల్గొనడం మంచిది.

45
న్యాయ సలహా తీసుకోవడం మంచిది..

కొన్ని బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా వేలం ఇళ్లు అమ్ముతాయి. వీటి మీద RBI పర్యవేక్షణ తక్కువగా ఉంటుంది. కాబట్టి న్యాయ సలహా తీసుకోవడం మంచిది. కొనుగోలు చేయాలనుకున్న ఇంటికి సంబంధించి ఎలాంటి లోపాలు కనిపించినా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం.

55
బ్యాంకులు లోన్స్ ఇవ్వవు..

ఒక వేలంలో ఇల్లు తక్కువ ధరకే దొరికిందని ఆనందపడకూడదు. ఆ ఇల్లు పూర్తిగా సమస్యలు లేకుండా ఉందని నిర్ధారించుకున్నాకే కొనాలి. ఎందుకంటే డాక్యుమెంట్స్ సరిగా లేని ఇళ్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చి వేలంలో ఇల్లు కొంటే మీరు అధిక వడ్డీలు కట్టుకోవడం సరిపోతుంది. దీంతో మీకు తక్కువకు ఇల్లు కొన్నానన్న ఆనందం కూడా ఉండదు.’’

Read more Photos on
click me!

Recommended Stories