కీప్యాడ్ సెల్ ఫోన్స్ వచ్చిన కొత్తలో దాదాపు 2004, 2005 సంవత్సరంలో వాటి ధర చాలా ఎక్కువ ఉండేది. ఆ రోజుల్లో కీప్యాడ్ ఫోన్ ఉన్న వాళ్లు చాలా ధనవంతులని అర్థం. అప్పట్లో వచ్చిన నోకియా 8800 సియెర్రా ఫోన్ చాలా ఎక్కువ ధర ఉండేది. ఇప్పుడు ఐఫోన్ కొనడం చాలా మందికి ఎలా అయితే లక్ష్యమో, అప్పట్లో నోకియా 8800 సియెర్రా ఫోన్ స్టేటస్ అలా ఉండేది.
అప్పట్లో ఈ ఫోన్ స్టేటస్ సింబల్‌గా ఉండేది. నోకియా 8800 సియెర్రా 2005లో లాంచ్ అయ్యింది. అప్పట్లో దీని ధర 900 డాలర్లు. అంటే అప్పట్లో దాదాపు రూ.36,000 గా ఉండేది. ఇప్పుడున్న డాలర్ ధర ప్రకారం సుమారు రూ.77,000 అన్నమాట. అప్పట్లో ఈ ఫోన్ ధనవంతులే కొనుగోలు చేయగలిగేవారు.