కరోనా వల్ల వారే ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయారు.. ఇప్పుడు పిల్లలను చూసుకోవటానికి సమయం కేటాయిస్తున్నారు..

First Published May 6, 2021, 1:23 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగం చేసే ప్రజల విధానాన్ని, అలవాట్లను మార్చింది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కే ప్రాధాన్యత ఇచ్చాయి. మరి కొన్ని కంపెనీలు ఉద్యోగాల కొత్త విధించగా, మరికొన్ని కంపెనీలు సిబ్బంది జీతాలను కూడా తగ్గించాయి.

కరోనా కారణంగా లాక్ డౌన్ నుండి దాదాపు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవల్సి వచ్చింది. వీరిలో ఉద్యోగం చేసే మహిళలపైనే తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది.
undefined
బిల్ & మెలిండా ఫౌండేషన్ విడుదల చేసిన ఒక నివేదికలో కరోనా వల్ల ఎక్కువగా మహిళ ఉద్యోగుల పైనే ప్రభావం సంభవించిందని పేర్కొంది. ఈ కారణంగా గత ఏడాదిలో ప్రపంచంలో 6.4 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. అంటే ఉద్యోగం చేసే 20 మంది మహిళల్లో ఒకరు నిరుద్యోగులుగా మారారు.
undefined
కరోనా వైరస్ వల్ల గరిష్ట నష్టం ఎక్కువ మహిళా ఉద్యోగులు ఉన్న రిటైల్, తయారీ, సేవా రంగాలలో జరిగిందని, అందువల్ల మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని నివేదిక పేర్కొంది. ఈ రంగాల ఉద్యోగులలో 40 శాతం మహిళలు ఉన్నారు.
undefined
పిల్లల సంరక్షణలో ఎక్కువ సమయంస్కూల్స్ మూసివేయడం వల్ల పిల్లల సంరక్షణపై కూడా మహిళలపై ఒత్తిడి పెరిగింది. గత సంవత్సరం వారానికి 26 గంటలతో పోలిస్తే మహిళలు ఇప్పుడు పిల్లల సంరక్షణలో వారానికి 31 గంటలు గడుపుతున్నారు. అంటే ఉద్యోగం చేసే మహిళలు ఇప్పుడు గత సంవత్సరం కంటే పిల్లలను చూసుకోవటానికి ఎక్కువ సమయం గడుపుతున్నారు.
undefined
దాదాపు ప్రతి దేశంలోదాదాపు ప్రతి దేశంలో పురుషుల కంటే మహిళలలే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయారని ఒక నివేదిక పేర్కొంది. కొలంబియా, కోస్టా రికా, ఈక్వెడార్, చిలీ వంటి దేశాలలో ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయిన మహిళలు ఉన్నారు. మొదటి 10 దేశాలలో యుఎస్, కెనడా, స్పెయిన్, బ్రెజిల్ ఉన్నాయి.
undefined
దీనితో పాటు, మహిళల పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ నివేదికలో నాలుగు మార్గాలు సూచించబడ్డాయి - డిజిటల్ స్ట్రెంత్, వ్యాపారంలో సహాయం, పాలసీ చేసేటప్పుడు ప్రతి రంగంలోనూ మహిళలు జాగ్రత్త వహించాలి.
undefined
click me!