ఈ క్రెడిట్ కార్డులు బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్ కార్డుల మాదిరిగానే రివార్డులను, క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అలాగే ఈ కార్డుతో టర్మ్ లోన్లు తీసుకోవచ్చు. తిరిగి చెల్లించడం వల్ల వారికి ఎన్నో ప్రయోజనాలు కూడా అందుతాయి. ఈ క్రెడిట్ కార్డును వాడిన తర్వాత.. చెల్లింపులు సకాలంలో చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ బలంగా మారుతుంది. ఈ క్రెడిట్ కార్డులు ద్వారా డబ్బును వాడిన తర్వాత తిరిగి చెల్లించేందుకు 45 నుండి 50 రోజుల వరకు వడ్డీ లేకుండానే కాలపరిమితిని అందిస్తుంది. వ్యాపారాలకు స్వల్ప కాలంలో వర్కింగ్ క్యాపిటల్ అందించడానికి ఈ క్రెడిట్ కార్డులను ప్రవేశపెడుతున్నారు. తిరిగి చెల్లించేందుకు ఈఎంఐ సేవలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. మోడీ ప్రభుత్వం ఈ క్రెడిట్ కార్డుల కోసం SBI, HDFC, యాక్సిస్ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టెడ్ ఇలా కొన్ని బ్యాంకులతో అనుసంధానమయ్యింది కేంద్ర ప్రభుత్వం.