పాలు పొంగిపోకుండా అడ్డుకునే స్మార్ట్ గ్లాస్ డిస్క్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?

Published : Sep 13, 2026, 04:39 PM IST

Milk Boil Over Protector: పాలు, టీ పొంగిపోవడం సాధారణం. దీనివ‌ల్ల పాలు వృథా కావడంతో పాటు స్టవ్‌ను శుభ్రం చేయాల్సిన పని కూడా పెరుగుతుంది. ఇలాంటి సమస్యను తగ్గించేందుకు అమెజాన్‌లో ఓ సూప‌ర్ గ్యాడ్జెట్ అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు.

PREV
15
పాలు మరిగే సమయాన్ని శబ్దంతో తెలియజేస్తుంది

డామ్రో స్మార్ట్ మిల్క్ బాయిల్ ఓవ‌ర్ ప్రొటెక్ష‌న్ (Damroo Smart Milk Boil Over Protector) పేరుతో ఈ ప్రొడెక్ట్ అందుబాటులో ఉంది. ఇది ఒక చిన్న గ్లాస్ డిస్క్. ఈ గ్లాస్ డిస్క్‌ను పాలు, టీ లేదా కాఫీ వేడి చేసే పాత్ర అడుగున ముందుగానే పెట్టాలి. ద్రవం మరిగే స్థాయికి చేరుకున్నప్పుడు పాత్రలోని వేడి, ఆవిరి కదలికల కారణంగా డిస్క్ కదులుతూ గలగల శబ్దం చేస్తుంది. ఆ శబ్దం వినిపించినప్పుడు పాలు పొంగే అవకాశం ఉందని గుర్తించి స్టవ్ మంటను తగ్గించవచ్చు లేదా స్టవ్‌ను ఆపేయవచ్చు. అందువల్ల పాలు పొంగి స్టవ్‌పై పడకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవచ్చు. ధ‌ర విష‌యానికొస్తే ఈ ప్రొడ‌క్ట్ అస‌లు ధ‌ర రూ. 345 ఉండ‌గా అమెజాన్‌లో 14 శాతం డిస్కౌంట్‌తో రూ. 295కి ల‌భిస్తోంది.

25
పాలు, టీ, కాఫీతో పాటు వివిధ పాత్రల్లో ఉపయోగించవచ్చు

Damrooను కేవలం పాల కోసం మాత్రమే కాకుండా టీ, కాఫీ వంటి ద్రవాలను వేడి చేసేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు. గ్యాస్ స్టవ్‌తో పాటు ఇతర రకాల వంట స్టవ్‌లపై ఉపయోగించే పాత్రల్లోనూ దీనిని పెట్టుకోవచ్చు. చిన్న పరిమాణంలో ఉండటంతో సాధారణ వంట పాత్రల్లో సులభంగా సరిపోతుంది. అయితే పాత్రను ఉపయోగించే ముందు డిస్క్‌ను అడుగున సరిగ్గా ఉంచడం ముఖ్యం.

35
ఉపయోగించడం చాలా సులభం

దీనిని ఉపయోగించడానికి ప్రత్యేకమైన సెటప్ అవసరం లేదు. ముందుగా ఖాళీ పాత్ర అడుగున ఈ గ్లాస్ డిస్క్‌ను ఉంచాలి. ఆ తర్వాత పాలు లేదా ఇతర ద్రవాన్ని పాత్రలో పోసి సాధారణంగా వేడి చేయాలి. ద్రవం మరిగే సమయంలో డిస్క్ నుంచి శబ్దం వినిపిస్తుంది. వెంటనే మంటను తగ్గించడం లేదా స్టవ్‌ను ఆపడం ద్వారా పొంగిపోవడాన్ని నివారించవచ్చు. వంటగదిలో ఇతర పనులు చేసుకునే సమయంలో కూడా ఇది ఒక చిన్న అలర్ట్‌లా ఉపయోగపడుతుంది.

45
బ్యాటరీలు, కరెంట్ అవసరం లేదు

శ‌బ్ధం చేస్తుంది క‌దా అని.. ఈ పరికరానికి బ్యాటరీలు, కరెంట్ లేదా ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థ అవసరం ఉండ‌దు మరిగే ద్రవం, వేడి, ఆవిరి వల్ల ఏర్పడే సహజ కదలికల ఆధారంగా ఇది శబ్దం చేస్తుంది. అందువల్ల బ్యాటరీ అయిపోవడం లేదా కరెంట్ లేకపోవడం వంటి సమస్యలు ఉండవు. పారదర్శకమైన గాజుతో తయారు చేయడం వల్ల సాధారణ వంటగది పరికరంలా సులభంగా ఉపయోగించుకోవచ్చు.

55
శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించుకోవచ్చు

Damrooను ఒక్కసారి ఉపయోగించి పడేయాల్సిన అవసరం లేదు. ఇది రీయూజ్ చేసుకునే గ్లాస్ డిస్క్. ఉపయోగించిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే తాకకుండా కొంత సమయం చల్లారనివ్వాలి. సాధారణంగా సుమారు 10 నిమిషాలు చల్లారిన తర్వాత దాన్ని తీసి శుభ్రం చేసుకోవచ్చు. గీతలు పడకుండా మృదువైన పద్ధతిలో, గట్టిగా రుద్దని డిటర్జెంట్‌తో శుభ్రం చేయడం మంచిది. ఇక ఈ ప్రొడ‌క్ట్ గ్లాసుతో త‌యారైంది కాబ‌ట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండ‌వు.

Read more Photos on
click me!

Recommended Stories