విమాన ప్రయాణికులకు ఇండిగో బంపర్‌ ఆఫర్‌..! ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫ్లయిట్ టికెట్..

Ashok Kumar   | Asianet News
Published : Aug 04, 2021, 05:12 PM ISTUpdated : Aug 04, 2021, 05:13 PM IST

భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో  15వ  వార్షికోత్సవం  పురస్కరించుకుని  డొమెస్టిక్‌ విమాన ప్రయాణాలపై రూ. 915 తక్కువ ప్రారంభ ధరతో మూడు రోజుల స్పెషల్ సేల్ బుధవారం ప్రకటించింది.   

PREV
15
విమాన ప్రయాణికులకు ఇండిగో బంపర్‌ ఆఫర్‌..! ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫ్లయిట్ టికెట్..

అంతే కాకుండా ఫాస్ట్ ఫార్వార్డ్, 6 ఇ ఫ్లెక్స్, 6 ఇ బాగ్‌పోర్ట్ సహా 6ఈ యాడ్-ఆన్‌లు రూ. 315 కి ఆఫర్ చేస్తుండగా కారు రెంట్ సర్వీస్ రూ. 315 నుంచి ప్రారంభమవుతుందని  తెలిపింది.
 

25

  హెచ్‌ఎస్‌బి‌సి క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ .3000 విలువైన టికెట్‌ బుకింగ్‌ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ అంటే రూ .750 వరకు అదనంగా ఆఫర్‌ని పొందవచ్చు. ఫ్లయిట్ కోసం కా-చింగ్ క్రెడిట్ కార్డును ఉపయోగించే కస్టమర్లకు  10 శాతం క్యాష్‌బ్యాక్‌తో అదనంగా 6ఈ  ప్రయోజనాలను పొందవచ్చు. ప్రీ-బుకింగ్ యాడ్-ఆన్‌ల కోసం కా-చింగ్ క్రెడిట్ కార్డును ఉపయోగించడంపై   20 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.

35

"మేము 15వ  వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు  ఇది మాకు ఒక ముఖ్యమైన సందర్భం. క్లిష్ట సమయాల్లో కూడా మాపై నమ్మకం ఉంచినందుకు మా కస్టమర్లకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు. ఈ ప్రయాణాన్ని విజయవంతం చేసిన మా కస్టమర్లు, భాగస్వాములు, విమానయాన సంస్థ సభ్యులందరికీ టీమ్ ఇండిగో తరపున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ”అని ఇండిగో సిఇఒ రోనోజోయ్ దత్తా ఒక ప్రకటనలో తెలిపారు.
 

45

ఇండిగో ఈ ఆఫర్‌ పూర్తి వివరాలను కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ఆఫర్‌ విమానాశ్రయ ఫీజులు,  ఛార్జీలు,  ప్రభుత్వం విధించే పన్నులపై వర్తించదని ఇండిగో పేర్కొంది. 

55
click me!

Recommended Stories